![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవలేదు, ఇదే సనాతన ధర్మం అంటే - ఉదయనిధి స్టాలిన్
Sanatan Dharma Row: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవకపోవడమే సనాతన ధర్మం అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉదయనిధి స్టాలిన్.
![కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవలేదు, ఇదే సనాతన ధర్మం అంటే - ఉదయనిధి స్టాలిన్ Udayanidhi Stalin Slams Modi Govt for Not inviting President to New Parliament Inauguration, Says a perfect example of Sanatan Dharma' కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవలేదు, ఇదే సనాతన ధర్మం అంటే - ఉదయనిధి స్టాలిన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/06/3b4a45f9ceefa9aec0bd2d1dbcdb8f7c1693981668346517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sanatan Dharma Row:
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై (Sanatan Dharma) చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా సద్దుమణగక ముందే..మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పిలవలేదన్న ఆయన...సనాతన ధర్మానికి ఇదే నిదర్శనమని అన్నారు.
"కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. సనాతన ధర్మం అంటే ఏంటో ఇంతకు మించి మంచి ఉదాహరణ ఇంకేముంటుంది..?"
- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి
#WATCH | Chennai | On being asked if he can give any example of practices of caste discrimination that need to be eradicated, Tamil Nadu Minister Udhayanidhi Stalin says "President Droupadi Murmu was not invited for the inauguration of the new Parliament building, that is the… pic.twitter.com/dU79QmDaqK
— ANI (@ANI) September 6, 2023
సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదైంది. ఆయన వ్యాఖ్యల్ని సమర్థించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేపైనా కేసు నమోదు చేశారు. మతాన్ని కించపరిచినందుకు, మనోభావాలు దెబ్బ తీసినందుకు యూపీలోని రామ్‌పూర్‌లో కేసులు నమోదయ్యాయి. లాయర్లు హర్ష్ గుప్త, రామ్ సింగ్ లోధి వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కంప్లెయింట్ ఇచ్చారు. తమ మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడారని అన్నారు. ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గే...ఈ ఇద్దరు నేతలూ I.N.D.I.A కూటమిలో ఉన్న వాళ్లే. అందుకే రాజకీయంగానూ ఇది దుమారం రేపింది. స్టాలిన్ వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ తీవ్ర స్థాయిలో మండి పడింది. కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా స్టాలిన్‌పై మండి పడ్డారు. ఇలాంటి కామెంట్స్ చేయడం వాళ్లకు ఇదేం మొదటి సారి కాదని విమర్శించారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా ఉదయనిధి స్టాలిన్‌పై మండి పడ్డారు. ధర్మాన్ని కించపరచడం సరికాదని మందలించారు.
కూటమిలో కలకలం..
ఉదయనిధి స్టాలిన్ I.N.D.I.Aలో ఉదయనిధి వ్యాఖ్యలు కలకలం రేపాయి. కూటమిలోని పార్టీలు సనాతన ధర్మానికి అనుకూల, వ్యతిరేక పార్టీలుగా విడిపోయాయి. దీంతో వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో I.N.D.I.Aను డైలమాలోకి పడేశాయి. ఉదయనిధి మాటలు కూటమిలో అలజడి రేపుతున్నాయి. దీంతో కూటమిలోని పార్టీలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. వచ్చే ఎన్నికల్లో ఉదయనిధి మాటలు కూటమికి నష్టాన్ని కలిగిస్తాయని భావించిన పార్టీలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. కూటమిని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీలు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భారత్ సెక్యులర్ దేశమని, ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం కూటమికి మంచిది కాదని, అన్ని మతాలను గౌరవించడమే తమ పార్టీల విధానమని వ్యాఖ్యానించారు.
Also Read: మాకో మాటైనా చెప్పాలిగా, ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి? ప్రధానికి సోనియా గాంధీ లేఖ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)