COVID19 Deaths in India: భారత్‌లో కరోనాతో తాజాగా ఇద్దరు మృతి, పలు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
Corona Cases In India | భారతదేశంలో చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అప్రమత్తంగా ఉంటే చాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

Covid 19 Cases In India News Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా కొత్త కోవిడ్19 వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. భారతదేశంలో COVID-19 కారణంగా తాజాగా ఇద్దరు మరణించడం కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి
COVID-19 కారణంగా రెండు మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ రిపోర్ట్ చేసింది. పలు రాష్ట్రాలలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు ప్రజలలో ఆందోళన పెంచుతోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, మహారాష్ట్రలోని థానేకు చెందిన 21 ఏళ్ల యువకుడు, కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో వైద్యశాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా COVID-19 యాక్టివ్ కేసులు
* కేరళ: 273 యాక్టివ్ కేసులు
* తమిళనాడు: 66 యాక్టివ్ కేసులు
* మహారాష్ట్ర: 56 యాక్టివ్ కేసులు
* ఢిల్లీ: 23 యాక్టివ్ కేసులు
* కర్ణాటక: 36 యాక్టివ్ కేసులు
వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని.. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి, చికిత్స తీసుకోవాలని అధికారులు సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి కొత్త ఆంక్షలను ప్రకటించలేదు. కానీ జనాభా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ ధరించాలని మాత్రం సూచిస్తూనే ఉంది. తుమ్మే సమయంలో చేతులు అడ్డుపెట్టుకోవాలని, గాలి ద్వారా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలను అప్రమత్తం చేశారు.
తేలికపాటి లక్షణాలు.. ఆందోళన అవసరం లేదు..
తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, కేరళ రాష్ట్రాల్లో JN.1 వేరియంట్ రకం కేసులు నమోదవుతున్నాయి. పరిశోధన విభాగం కార్యదర్శి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) ఇతర శాఖల అధికారులతో తాజా కరోనా వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సమీక్షించారు. ప్రస్తుతం పాజిటివ్ కేసులలో చాలా మందికి తేలికపాటి కోవిడ్19 లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, నీరసం, తలనొప్పి లాంటి ల
అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. కరోనా కేసులపై ఎప్పటికప్పుడు అప్రమత్తమై చర్యలు చేపట్టాలని సూచించింది. హాస్పిటల్స్ లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బెడ్స్ సిద్ధం చేయడం, ఆక్సిజన్ సిలింజర్లు అందుబాటులో ఉంచడం, టెస్టింగ్ కిట్స్, మెడిసిన్, టీకాలు ఐసోలేషన్ సెంటర్లు సిద్దం చేయాలని వైద్యశాఖ అధికారులు సూచించారు.






















