అన్వేషించండి

Delhi Cantt Rape: రాహుల్ గాంధీ ట్వీట్ డిలీట్... రేప్‌ బాధితురాలి ఫ్యామిలీ ఫొటో పోస్టు చేయడంపై దుమారం

పోక్సో చట్టాన్ని అతిక్రమించి అత్యాచారానికి గురైన బాధితురాలి ఫ్యామిలీ వివరాలు చెప్పినందుకు ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చింది ఎస్‌సీపీసీఆర్. రాహుల్ ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది.

పోక్సో చట్టాన్ని అతిక్రమించి అత్యాచారానికి గురైన బాధితురాలి ఫ్యామిలీ వివరాలు చెప్పినందుకు ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చింది ఎస్‌సీపీసీఆర్. రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో బాధితురాలి ఫ్యామిలీని ఓదారుస్తున్నట్టు పెట్టిన ఫొటో ఇప్పుడు వివాదానికి దారి తీసింది. 

వివాదానికి దారి తీసిన రాహుల్‌ గాంధీ ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది. హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ  కలిశారు. న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా ఉంటామంటూ వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో రాహుల్ పోస్టు చేశారు. 

ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ఏరియాలో బాలిక హత్యాచారానికి గురైంది. ఇది పెను దుమారాన్నే రేపింది. బాలిక తల్లిదండ్రులను కలిసిన కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ... వాళ్లకు అండగా ఉంటామంటూ హమీ ఇచ్చారు. వాళ్లతో కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించారు.  ఆ తర్వాత వాళ్లతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు. 

పోక్సో చట్టం రూల్స్ ప్రకారం రేప్ బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలి. ఈ రూల్‌ను అతిక్రమించారని... రాహుల్ గాంధీ, ట్విట్టర్‌పై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు ఫిర్యాదు అందింది. బాధితుల వివరాలు బహిర్గతం చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుదారు. 

ఫిర్యాదుపై స్పందించిన జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్... ట్విట్టర్‌ తరఫున ఇండియాలో ఉండే గ్రీవెన్స్‌ ఆఫీసర్‌కు లెటర్ రాసింది. రేప్‌ విక్టిమ్‌ ఫ్యామిలీ ఫొటో ట్విట్టర్‌లో పోస్టు చేయడం చాలా బాధాకరమని... ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షార్హమని సూచించింది. పోక్సో చట్టంలోని 23సెక్షన్, జువైనల్ యాక్ట్ 2015లోని 74 సెక్షన్ ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 

ఈ లెటర్‌పై ట్విట్టర్‌ రియాక్ట్ అయింది. రాహుల్ గాంధీ పోస్టు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసింది. ఢిల్లీలో ఓ బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేశారు. ఈ ఘటన రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. ఆగస్టు 1న నైరుతి ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేసి సామూహిక అత్యాచారం, హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులకు తెలియకుండానే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా  దర్యాప్తు స్టార్ట్ చేశారు.  నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు సహకరించిన పూజారితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబ్‌ అధికారులు ఆధారాలు సేకరించారు. 

ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ సహా అనేక మంది నేతలు పరామర్శించారు. బీజేపీ మాత్రం ఈ ఘటనను.. రాజకీయంగా వాడుకుంటున్నారని .. విపక్ష నేతలపై విమర్శలు గుప్పించింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విపక్షాల ఆందోళన.. పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా
విపక్షాల ఆందోళన.. పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Embed widget