Viral Video : అల్లర్లలో తగ్గేదేలే లేదంట - కోర్టు ఆవరణలోనే నిందితుడి ఓవరాక్షన్ !

అల్లర్లలో నిందితుడైన వ్యక్తి తగ్గేదేలేదంటూ సైగ చేసిన ఘటన ఢిల్లీ కోర్టులో చోటు చేసుకుంది. అతని ప్రవర్తన సోషల్ మీడియా చర్చనీయాంశమవుతోంది.

FOLLOW US: 

నేరం చేసే వాళ్లకు చట్టమంటే  భయం ... పోలీసులంటే లెక్కలేని తనం... న్యాయస్థానం అంటే గౌరవం లేకపోవడం సహజం. వారికి అవి నేర్పిస్తేనే నేరాలు చేయకుండా ఉంటారు. కానీ కొంత మంది తాము అన్నింటికీ ఆతీతులమని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నేతల ప్రమేయం ఉన్న ఘటనల్లో నిందితులు విపరీత ప్రవర్తనకు పోతూంటారు. ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణ జరిగింది. 

ఢిల్లీలోని జహంగీర్ పూర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఘర్షణ చోటు చేసుకుంది. కొంత మంది దుండగులు హనుమాన్ శోభాయాత్రపై రాళ్ల దాడులకు పాల్పడ్డారు. చివరికి అది భారీ ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలకు కారణమైన వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.  వారిని రోహిణి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టులో హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో అల్లర్లకు పాల్పడిన  అన్సార్ తగ్గేదేలేదు అంటూ నవ్వుతూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం చేసి చూపించారు. 

అన్సార్ క్రిమినల్. ప్రజలను రెచ్చగొట్టి, రాళ్లు రువ్వేలా చేశారు. వారి నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండి ఉంటుందని.. వారే బయటకు తీసుకు వస్తారనే ధీమాతో ఇలా  వెకిలి వేషాలు వేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మత రాజకీయాలు చేస్తూ... ఇతర మతాలపై దాడులకు పాల్పడితే విషయం రాజకీయం అవుతుందని తెలిసి కూడా కొంత మంది కావాలనే చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Published at : 18 Apr 2022 05:56 PM (IST) Tags: Delhi Court Delhi riots overaction of accused

సంబంధిత కథనాలు

Bharat Bandh : సీపీఎస్‌ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్

Bharat Bandh : సీపీఎస్‌ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్

Qutub Minar Hearing: హిందూ, జైన దేవాలయాల పునరుద్ధరణపై వాదనలు పూర్తి- తీర్పు జూన్‌9కి వాయిదా వేసిన దిల్లీ కోర్టు

Qutub Minar Hearing: హిందూ, జైన దేవాలయాల పునరుద్ధరణపై వాదనలు పూర్తి- తీర్పు జూన్‌9కి వాయిదా వేసిన దిల్లీ కోర్టు

Quad Summit 2022 : విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిని ఇస్తుంది: ప్రధాని మోదీ

Quad Summit 2022 : విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిని ఇస్తుంది: ప్రధాని మోదీ

Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Punjab CM Bhagwant Mann :  కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి -  పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?

Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?

Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Amalapuram Protests: అమలాపురం విధ్వంసంపై పోలీసులు విశ్లేషణ- కారుకులను గుర్తించే పనిలో ఖాకీలు

Amalapuram Protests: అమలాపురం విధ్వంసంపై పోలీసులు విశ్లేషణ- కారుకులను గుర్తించే పనిలో ఖాకీలు