SC On Nupur Sharma: నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట- కీలక ఆదేశాలు జారీ
SC On Nupur Sharma: నుపుర్ శర్మపై ఆగస్టు 10 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది.
SC On Nupur Sharma: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
#BREAKING Supreme Court grants interim relief to former BJP Spokesperson Nupur Sharma, directs that no coercive steps be take against her in the FIRs/Complaints registered over her remarks on Prophet Mohammed or on FIRs/Complaints which may be registered in future.
— Live Law (@LiveLawIndia) July 19, 2022
దేశవ్యాప్తంగా నుపుర్ శర్మపై దాఖలైన కేసుల్లో ఆగస్ట్ 10 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశించింది. నుపుర్‌కు ప్రాణహాని ఉన్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.
సుప్రీం వ్యాఖ్యలు
మహ్మద్ ప్రవక్త విషయంలో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పాలని సుప్రీం తెలిపింది.
తనకు ఉన్న ప్రాణ హాని, అత్యాచార బెదిరింపులు వస్తున్నందున దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను దిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నుపుర్ శర్మ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భాజపా బహిష్కృత నేతపై సుప్రీం కోర్టు మండిపడింది.