News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

J&K Statehood: జమ్ము & కశ్మీర్‌ను రాష్ట్రంగా ఎప్పుడు ప్రకటిస్తారు? కేంద్రానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

J&K Statehood: జమ్ము & కశ్మీర్ కు ఎప్పుడు రాష్ట్ర హోదా ప్రకటిస్తారని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

FOLLOW US: 
Share:

J&K Statehood: జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు కల్పిస్తారని, అందుకు గడువును ఎప్పుడు నిర్ణయిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు.. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక అధికారులు మంజూరు చేసిన ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తోంది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జమ్మూ కశ్మీర్ ను.. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కేవలం తాత్కాలికమైనది కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో జమ్మూ కశ్మీర్ ను పూర్తి స్థాయి రాష్ట్రంగా, లడఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంచుతామని చెప్పారు. 

సోలిసిటర్ జనరల్ వాదనలు విన్న సుప్రీం కోర్టు బెంచ్.. జమ్ము కశ్మీర్, లడఖ్ లు ఎంత కాలం కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉంటాయని ప్రశ్నించింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఏదైనా రోడ్ మ్యాప్ ఉంటే బహిర్గతం చేయాలని నిర్దేశించింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అత్యంత ముఖ్యమని.. జమ్మూ కశ్మీర్ లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ప్రశ్నించింది.

కోర్టు అడిగిన ప్రశ్నలకు తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించాలననే అంశం ప్రస్తుతం పార్లమెంటులో ఉందని తెలిపారు. కశ్మీర్ లో పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు మొదలు అవుతాయని సుప్రీం కోర్టు బెంచ్ కు విన్నవించారు. 2020 లో జమ్మూ కశ్మీర్ లో డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్ (డీడీసీ) ఎన్నికలు జరిగాయని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు అవేనని తుషార్ మెహతా చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ముందుకు వెళ్తోందని, ఎన్నికలు తప్పకుండా నిర్వహిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా.. కేంద్ర పాలిత ప్రాంతాన్ని మళ్లీ రాష్ట్రంగా మార్చగలరా అని సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నకు.. తుషార్ మెహతా అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లను ఉదాహరణగా చూపించారు.  

Also Read: Aditya-L1: సూర్యుడిపై నిఘా కోసమే ఆదిత్య-ఎల్1, మానవాళికి ముప్పు తప్పించేందుకేనంటున్న ఇస్రో!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత హర్తాల్ లు, దాడుల కారణంగా బ్యాంకులు, విద్యా సంస్థలు పదేపదే మూసివేయాల్సిన వస్తోందని తుషార్ మెహతా వివరించారు. అయితే.. ఇప్పుడు శాంతి నెలకొందని, సాధారణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కన పెట్టి జమ్మూ కశ్మీర్ ను.. జమ్మూ & కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మళ్లీ జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Published at : 29 Aug 2023 04:02 PM (IST) Tags: Centre Supreme Court Jammu and Kashmir Statehood Restoration

ఇవి కూడా చూడండి

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది - వైరల్ వీడియో

ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది - వైరల్ వీడియో

కార్‌పూలింగ్‌ని బ్యాన్ చేసిన బెంగళూరు, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా - కారణమిదే

కార్‌పూలింగ్‌ని బ్యాన్ చేసిన బెంగళూరు, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా - కారణమిదే

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'