ఎయిర్‌హోస్టెస్‌ని అసభ్యకరంగా ఫొటోలు తీసిన వృద్ధుడు, నిలదీసిన సిబ్బంది - చివరకు క్షమాపణలు
SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌ని అభ్యంతరకంగా ఫొటోలు తీశాడు.
SpiceJet:
స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో..
ముంబయికి చెందిన స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో ఓ వృద్ధుడు ఎయిర్ హోస్టెస్‌ని దొంగ చాటుగా ఫొటోలు తీశాడు. ఇది గమనించిన ఎయిర్ హోస్టెస్ వెంటనే నిలదీసింది. చాలా సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఓ వ్లాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..వైరల్ అయింది. అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీసినట్టు ఎయిర్ హోస్టెస్ తీవ్రంగా ఆరోపించింది. ఫొటోలు తీస్తుండడాన్ని గమనించిన వెంటనే ఫోన్ లాక్కుని చూసింది. కాసేపు గొడవ పడిన ఆ వృద్ధుడు ఆ తరవాత సారీ చెప్పాడు. వెంటనే ఆ ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశాడు. ఆ తరవాత అపాలజీ లెటర్ కూడా రాశాడు.
"ఢిల్లీ-ముంబయి స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో మావి A,B సీట్‌లు. C సీట్‌లో ఓ వృద్ధుడు కూర్చున్నాడు. ఫ్లైట్ అటెండెంట్ ఫుడ్ సర్వ్ చేస్తున్న సమయంలో తన మొబైల్‌తో అసభ్యకరంగా వీడియోలు ఫొటోలు తీశాడు. ఇది గమనించి నేను వెంటనే ఆమెకి ఇన్‌ఫామ్ చేశాను. తనకు కూడా అనుమానం ఉన్నట్టు చెప్పింది. వెంటనే ఆయన ఫోన్ లాక్కుని చెక్ చేశాం. కాళ్లను వీడియో తీశాడు. ఇష్టమొచ్చిన చోట ఫొటోలు తీశాడు"
- ప్రత్యక్ష సాక్షి
స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ కూడా ఈ ఘటనను ధ్రువీకరించింది. ఆ ప్రయాణికుడు తన ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసినట్టు వెల్లడించింది. టేకాఫ్ అయ్యే టైమ్‌లో జంప్ సీట్‌పై కూర్చునే సమయంలో ఎయిర్‌హోస్టెస్ వీడియోలు షూట్ చేశాడని, నిలదీసిన తరవాత తన తప్పుని ఒప్పుకున్నాడని వివరించింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. లైంగిక వేధింపుల విషయంలో స్పైస్‌జెట్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యం వహిస్తోందని మండి పడింది.
Passenger who allegedly tried to click obscene pics of a @flyspicejet air hostess & a co-pax on a recent Delhi-Mumbai flight apologises for his “misbehaviour” & vows never to “repeat ever”
— Saurabh Sinha (@27saurabhsinha) August 18, 2023
Apology after @DCWDelhi issued notice to @DGCAIndia & @DelhiPolice on this case today pic.twitter.com/6yaLfVN0Dg
ఇటీవల ఇండిగో ఫ్లైట్‌లో (Indigo Airlines) మహిళా ప్యాసింజర్ని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. తనను లైంగికంగా వేధించినట్టు 24 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కంప్లెయింట్ ఆధారంగా నిందితుడు ప్రొఫెసర్ రోహిత్ శ్రీవాస్తవను అరెస్ట్ చేసిన పోలీసులు జ్యుడీషయల్ కస్టడీకి తరలించారు. ఆ తరవాత నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...శ్రీవాస్తవ, బాధితురాలి సీట్‌లు పక్కపక్కనే ఉన్నాయి. జులై 26న ఢిల్లీ నుంచి ఉదయం 5.30 గంటలకు ఇండిగో ఫ్లైట్ ముంబయికి బయల్దేరింది. మరి కాసేపట్లో ముంబయిలో ల్యాండ్ అవుతుందనగా...పక్కనే ఉన్న మహిళను అసభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు. ఇది సహించలేక బాధితురాలు వాగ్వాదానికి దిగింది. సిబ్బంది జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ముంబయిలో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరినీ సహార్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లింది ఇండిగో సిబ్బంది. తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
Also Read: పసికందులను హత్య చేసిన యూకే నర్స్, కేసుని ఛేదించడంలో ఇండియన్ డాక్టర్ సాయం