అన్వేషించండి

Russia Ukraine Conflict: బుకారెస్ట్‌ చేరుకున్న స్పెషల్ ఫ్లైట్స్‌, ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను తరలించేందుకు స్పెషల్ ఆపరేషన్

Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌(Ukraine)లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి బుకారెస్ట్(Bucharest), హంగేరియన్(Hungarian) రాజధాని బుడాపెస్ట్‌(Budapest)కు ఎయిర్ ఇండియా విమానాలు చేరుకున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి భారత్‌లో ఒకటే టెన్షన్. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ బిడ్డలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు కంగారు పడిపోతున్నారు. అటు ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను తరలించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఆ దిశగా చర్యలు చేపట్టింది. 

సరిహద్దులు దాటించి...

ఉక్రెయిన్‌లో నేరుగా విమానాలు దిగే ఛాన్స్ లేనందున సమీప దేశాల నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రైవేట్ వెహికల్స్ బుక్క్ చేసుకొని ఉక్రెయిన్ సరిహద్దు దాటి వచ్చేయాలని విద్యార్థులకు రూట్‌ మ్యాప్ ఇచ్చింది. విద్యార్థులు వెళ్లే వెహికల్స్‌కు ఇండియా జెండా పెట్టుకోవాలని సూచించింది.

ఎయిరిండియా ప్రత్యేక విమానం

ఉక్రెయిన్ సరిహద్దు దాటి వచ్చిన విద్యార్థుల కోసం రొమేనియా, హంగేరిలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. భారతీయుల తరలింపు కోసం ఎయిర్ ఇండియా AI-1943 ప్రత్యేక విమానం రొమేనియాలోని బుకారెస్ట్‌లో ల్యాండ్ అయింది.ఈ ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయం నుంచి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది. .

Russia Ukraine Conflict: బుకారెస్ట్‌ చేరుకున్న స్పెషల్ ఫ్లైట్స్‌, ఉక్రెయిన్ నుంచి మన విద్యార్థులను తరలించేందుకు స్పెషల్ ఆపరేషన్

AI-1943 అనే విమానం ముంబై విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 3.40 గంటలకు బయలుదేరింది. ఇండియన్ టైం ప్రకారం పది గంటలకు బుకారెస్ట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. 

ఉక్రెయిన్- రొమేనియాకు భారత్‌ విద్యార్థులు

భారతీయ విద్యార్థులను సరిహద్దులకు చేరుకోమని కోరిన తర్వాత, ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న జాతీయులను భారత ప్రభుత్వ అధికారులు బుకారెస్ట్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో స్వస్థలాలకు చేరుస్తారని అధికారులు తెలియజేసినట్లు PTI తెలిపింది.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం బుకారెస్ట్, హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్‌కు మరిన్ని ఎయిర్ ఇండియా విమానాలు నడపనుంది ప్రభుత్వం. 

రష్యాతో వివాదం కారణంగా తమ గగనతలంలో విమానాలు ఎగరడాన్ని ఉక్రెయిన్ పూర్తిగా నిషేధించింది. అందుకే విద్యార్థుల తరలింపులో జాప్యం జరిగింది. విద్యార్థులు, వారి ఫ్యామిలీ మెంబర్స్‌ ఒత్తిడి పెరిగిపోవడంతో ప్రభుత్వం ప్రత్నామ్నాయ ఏర్పాట్లను పూర్తి చేశారు. బుకారెస్ట్, బుడాపెస్ట్ వరకు విద్యార్థులను తీసుకురావాలని ఎంబసీ అధికారులకు సూచించింది. దాదాపు 20,000 మంది భారతీయులు, ప్రధానంగా విద్యార్థులు, ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని అధికారులు గుర్తించారు.

ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడానికి ముందే, ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 22న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు విమానం పంపించింది. 240 మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది. 

దిల్లీ, ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్స్‌ 

తర్వాత పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. భారతీయ పౌరులను తరలించడానికి ప్రత్యేక ప్రభుత్వ చార్టర్ విమానాలు నడపనున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొంది. దిల్లీ, ముంబై నుంచి బుకారెస్ట్, బుడాపెస్ట్‌కు B787 విమానాలను నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

ప్రస్తుతం ఉజ్హోరోడ్ సమీపంలోని చాప్-జహోనీ హంగేరియన్ సరిహద్దు, చెర్నివ్ట్సీ సమీపంలోని పోరుబ్నే-సిరెట్ రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్లు ఉన్నాయి. అక్కడ వెరిఫై చేసి ఆయా దేశాల్లోకి పంపిస్తారు. 

జెండా, పాస్‌పోర్ట్ తప్పనిసరి

భారతీయ ప్రయాణికులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు, ఇతర అవసరమైన వస్తువులు, కోవిడ్ -19 టీకా ధృవీకరణ పత్రాలను సరిహద్దు చెక్‌పోస్టులకు తీసుకెళ్లాలని విదేశాంగ శాఖ సూచించింది. వాహనాలు, బస్సులపై భారత జెండా అతికించాలని తెలిపింది. 

కీవ్ , రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 600 కి.మీ . రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ఎనిమిదిన్నర గంటల నుంచి 11 గంటల సమయం పడుతుంది. 

బుకారెస్ట్ రొమేనియన్ సరిహద్దు చెక్‌పాయింట్ నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవడానికి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పడుతుంది.

కీవ్, హంగేరియన్ సరిహద్దు చెక్‌పాయింట్ మధ్య దూరం దాదాపు 820 కిలోమీటర్లు ఉంది. దానిని రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే 12-13 గంటలు పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget