అన్వేషించండి

Social Media: సోషల్ మీడియాకు ఏజ్ లిమిట్ పెట్టండి - కర్ణాటక హైకోర్టు

Social Media: సోషల్ మీడియాను ఉపయోగించడానికి కనీస వయోపరిమితిని ఏర్పాటు చేయాలని, ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని కర్ణాటక హైకోర్టు మంగళవారం ప్రతిపాదించింది.

Social Media: సోషల్ మీడియాను ఉపయోగించడానికి కనీస వయోపరిమితిని ఏర్పాటు చేయాలని, ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని కర్ణాటక హైకోర్టు మంగళవారం ప్రతిపాదించింది. పాఠశాలలు, కళాశాలకు వెళ్లే పిల్లలను సోషల్ మీడియాకు అలవాటు  పడడం ద్వారా కలిగే ప్రమాదాలపై చర్చల సందర్భంగా, న్యాయమూర్తులు జి.నరేందర్ విజయ్‌కుమార్, పాటిల్‌లతో కూడిన ధర్మాసనం ఈ సిఫార్సు చేసింది. మైనర్లలో సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోర్లు సూచించింది.

సోషల్ మీడియాపై నిషేధాన్ని అమలు చేయడం లేదా, వినియోగదారులకు కనీస వయస్సు 21 ఏళ్లుగా నిర్ణయించాలని కోర్టు సిఫార్సు చేసింది. పాఠశాలకు వెళ్లే పిల్లలు సోషల్ మీడియాకు బానిస అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలోని ఓ కంటెంట్ చూసిన 17 లేదా 18 ఏండ్ల పిల్లలకు.. అది దేశ ప్రయోజనాలకు సంబంధించినదా  కాదా  అని నిర్ధారించే పరిపక్వత ఉంటుందా అని నిలదీసింది. దేశంలో మద్యం విక్రయించేందుకు, ఓటు హక్కు కల్పించేందుకు వయసును పరిగణలోకి తీసుకుంటున్నారని, సోషల్ మీడియా వినియోగానికి సైతం ఏజ్ లిమిట్ ఉండాలని అభిప్రాయపడింది.

నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలనే కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) చేసిన అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ గేమ్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ఆధార్, ఇతర డాక్యుమెంటేషన్‌ను అందించడం తప్పనిసరి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కోర్టు స్పందిస్తూ, సోషల్ మీడియాకు ఇలాంటి చర్యలను ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించింది. సర్దుబాట్లు మార్పుల అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. నిర్దిష్ట నియమాలు, మార్గదర్శకాల ఆధారంగా స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు అవసరాన్ని బెంచ్ వివరించింది. 

అంతేకాకుండా కంటెంట్ తొలగింపుపై , X Corp సహజ, సానుకూల తీర్పులను ఆశించకూడదని కోర్టు పేర్కొంది. ప్రశ్నలోని కంటెంట్ సమాచార సాంకేతిక చట్టం, 2000, సెక్షన్ 69A (1), (2)ను ఉల్లంఘిస్తుందో లేదో అంచనా వేసే ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపించినప్పుడు మాత్రమే నిరోధించే ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది

దీనిపై X Corp తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. పోస్ట్‌లు, అకౌంట్ బ్లాకింగ్‌పై చట్టాల వివరణకు సంబంధించి గతంలో సింగిల్ జడ్జి చేసిన పరిశీలనలు అప్పీల్‌కే పరిమితమైందని వివరించారు. వివాదాస్పద పోస్ట్‌లు, ఖాతాలను బ్లాక్ చేయాలనే డిమాండ్‌లకు X Corp కట్టుబడి ఉందని పేర్కొంన్నారు. అయితే, 1,000కి పైగా ట్వీట్‌లను తీసివేయమని చెప్పడానికి తగిన కారణాలు లేవన్నారు.  

కొన్ని యూఆర్‌ఎల్స్‌ను బ్లాక్ చేయాలని, పోస్టులు డిలీట్ చేయాలని భారత ప్రభుత్వంX Corpకు ఉత్తర్వులను జారీ చేసింది. దీనిని X Corp సవాలు చేసింది. కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి X Corp సవాలును తిరస్కరించారు. లింకులను బ్లాక్ చేయడం ఆలస్యం చేసినందుకు రూ. 50 లక్షల జరిమానా విధించారు. దీనిపై X Corp డివిజనల్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. ఆగస్టు 10న సింగిల్ జడ్జి ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అప్పటికే ఎక్స్ రూ.25 లక్షలు జమ చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Nani Or Naga Chaitanya: శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Embed widget