Budget 2024: కేంద్ర మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్...నేడు మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ?
Central Budget Introducing : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ( Finance Minister ) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman)...నేడు మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ? ఏ యే వర్గాలకు వర్గాలకు ఊరట కల్పిస్తారు ? పన్ను పరిమితి పొడిగిస్తారా ? ఎన్నికల హామీలు ఏమైనా బడ్జెట్ లో ప్రకటిస్తారా ? ఏమేం ప్రకటనలు ఉండబోతున్నాయి? అన్నది ఆసక్తికరంగామారింది. సార్వత్రిక ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండటంతో...ఎవరికి వరాల జల్లు కురిపిస్తారా ? వేతన జీవులకు శుభవార్త చెబుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్
బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్...రికార్డును సొంతం చేసుకోనున్నారు. అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిలవనున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జి దేశాయ్ సరసన ఆమె నిలవబోతున్నారు. నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఆర్థిక మంత్రి డాక్యుమెంట్‌లోని కీలక అంశాలను క్రోడీకరించి, ప్రతిపాదనల వెనుక ఉన్న ఆలోచనలను ప్రజెంటేషన్ సమయంలో వివరిస్తారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ఉభయ సభలు ఆమోదం పొందాక బడ్జెట్ తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు.
రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి బడ్జెట్
రాష్ట్రపతి ఆమోదంతో బడ్జెట్ అమల్లోకి వస్తుంది. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సెషన్‌కు ముందు వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖల నుండి గ్రాంట్ల కోసం చివరి బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్‌ల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చు ప్రతిపాదనలను కోరింది. 2024 మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడి, తన బడ్జెట్ ను ప్రవేశపెట్టే వరకు అమల్లో ఉండేలా, మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ భద్రత
సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగించింది. తాజాగా 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 140 మంది సెక్యూరిటీ సిబ్బందిలో 36 మంది అగ్నిమాపక శాఖ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ప్రస్తుతం లక్షా 70 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖ అధీనంలోని ఇది పని చేస్తుంది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 68 విమానాశ్రయాలు, అణుశక్తి, ఢిల్లీ మెట్రో, ఏరోస్సేస్ కేంద్రాల వద్ద సీఐఎస్ఎప్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి. సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీయూనిట్ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ భద్రతా బృందాలతో కలిసి కొన్నిరోజుల క్రితం సర్వే చేపట్టారు. కేంద్ర హోం శాఖకు నివేదిక ఇచ్చిన తర్వాత...140 మంది సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ లో విధులు నిర్వహిస్తున్నారు.