(Source: ECI/ABP News/ABP Majha)
Russia Ukraine Conflict: ఉక్రెయిన్ నుంచి భారత్‌కు పౌరుల తరలింపు వేగవంతం - ఇప్పటివరకూ ఎంత మందిని తీసుకొచ్చారంటే..
Operation Ganga: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగ ప్రాజెక్టు విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం రోజుకు 16కు పైగా విమానాలు పౌరుల్ని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తరలిస్తున్నాయి.
Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంపై తటస్థంగా వ్యవహరిస్తూనే భారత్ తమ పౌరుల భద్రత కోసం చర్యలను కట్టుదిట్టం చేసింది. గత 10 రోజుల నుంచి ఉక్రెయిన్‌పై దాడులు (Ukraine Russia Conflict) కొనసాగిస్తోంది. ఓవైపు చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు ప్రధాన నగరాలపై రష్యా సైనిక చర్యను ముందుకు తీసుకెళ్తోంది. భారత ప్రభుత్వం తమ పౌరులను స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్ గంగ ప్రాజెక్టు విజయవంతంగా సాగుతోంది. ఇప్పటివరకూ ఉక్రెయిన్ నుంచి 11 వేలకు పైగా పౌరులను భారత్‌కు తరలించారు.
రోజుకు 16కు పైగా విమానాలు..
ఉక్రెయిన్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారత ఆర్మీ సహకారంతో పౌరులను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చేందకు ఆపరేషన్ గంగ ప్రాజెక్టును చేపట్టింది. తొలి రోజుల్లో రోజుకు ఒకట్రెండు విమానాలను నడిపిన కేంద్రం తాజాగా రోజుకు 16 వరకు ప్రత్యేక విమానాలను భారత్ నుంచి ఉక్రెయిన్, రొమేనియా, పొలాండ్, హంగరీలకు పంపిస్తోందని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి మురళీధరన్ (Union Minister of State for External Affairs Muraleedharan) అన్నారు. యుద్ధం మొదలైన తరువాత ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకూ 11,000 కు పైగా భారత పౌరులను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చామని మంత్రి వెల్లడించారు.
ఆపరేషన్ గంగ ఫుల్ స్వింగ్.. (Operation Ganga)
తమ పౌరులను భారత్‌కు క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగ ప్రాజెక్టు వేగవంతం చేశామని కేంద్ర మంత్రి మురళీధరన్ తెలిపారు. ఎయిర్ ఏషియా విమానం ద్వారా 170 మంది శనివారం వేకువజామున ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారత పౌరులను మంత్రి మురళీధరన్ రిసీవ్ చేసుకున్నారు. వారి బాగోగులు, సహాయ సహకార చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మిషన్‌లో భాగస్వాములు అయిన వారికి, సహకారం అందించిన విదేశీ ప్రభుత్వాలు, అక్కడి ఎంబసీ అధికారులు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రంగంలోకి దిగిన కమలా హారిస్..
నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రంగంలోకి దిగారు. ఈ నెల 9 నుంచి 11 తేదీలలో నాటో సభ్య దేశాలలో పర్యటించనున్నారు. మరోవైపు యూరప్ లోని అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపోరిజియాను రష్యా స్వాధీనం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం వెనక్కి తగ్గకుండా ప్రతిదాడులు చేస్తూ సహాయం కోసం ఎదురుచూస్తోంది.
Also Read: Ukraine Russia War: 229 మందితో రొమేనియా నుంచి ఢిల్లీకి ఇండిగో విమానం - కొనసాగుతున్న ఆపరేషన్ గంగ
Also Read: Russia-Ukraine War: ఒకే దారిలో భారత్, చైనా, పాక్- మూడోసారి కూడా ఓటింగ్‌కు దూరం