Rare Pic: ఒకే వేదికపై యశ్వంత్ సిన్హా, ద్రౌపది ముర్ము- వైరల్ పిక్ చూశారా?
Rare Pic: ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా ఒకే వేదికపై ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Rare Pic: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మ, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు సంబంధించిన ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారు.
అరుదైన ఫొటో
(Image Source: PTI)
ఈ ఫొటోలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో ఉన్న ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా ఉన్నారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న వినోబా భావే యూనివర్సిటీలో జరిగిన 7వ స్నాతకోత్సవానికి సంబంధించిన ఫొటో ఇది.
ఈ కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు ప్రస్తుత ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. దీంతో యూనివర్సిటీ చాన్స్‌లర్ హోదాలో ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రస్తుతం విపక్షాల తరఫున రాష్ట్రపతి రేసులో ఉన్న యశ్వంత్ సిన్హా గౌరవ డి.లిట్ డిగ్రీ అందుకున్నారు. ఒకే ఫ్రేమ్‌లో వీరిద్దరూ ఉండటంతో ఫొటో సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది.
2017 జులై 25న రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది జులై 24తో రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
కీలక తేదీలు
- ఎన్నికల నోటిఫికేషన్: జూన్ 15
- నామినేషన్లకు చివరి రోజు: జూన్ 29
- నామినేషన్ల పరిశీలన: జూన్ 30
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 2
- పోలింగ్: జులై 18
- కౌంటింగ్, ఫలితాలు: జులై 21
- ప్రమాణస్వీకారం: జులై 25
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకోనుంది. ఎలక్టోరల్ కాలేజ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ఎలక్టోరల్ కాలేజ్‌లో 4809 మంది సభ్యులు ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇందులో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ 700 అని కమిషనర్ వెల్లడించారు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల విలువ 10,98,903గా పేర్కొన్నారు. 5,34, 680 ఓట్ల విలువ పొందిన అభ్యర్థి విజయం సాధిస్తారని ఈసీ తెలిపింది.
Also Read: Sharad Pawar: 'నాకూ ఓ లవ్ లెటర్ వచ్చింది'- ఐటీ శాఖ నోటీసులపై పవార్ పవర్‌ఫుల్ పంచ్!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 17వేల కరోనా కేసులు- 23 మంది మృతి