India Pakistan Attack News: త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం
Operation Sindoor: పాకిస్థాన్ దుశ్చర్యలు, దేశంలో భద్రతా పరిస్థితిపై CDS, ఆర్మీ, నేవీ, వైమానిక దళ అధిపతులు, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌తో రాజ్‌నాథ్ సింగ్స మీక్షించారు.

Operation Sindoor: భారత్-పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో త్రివిధ దళాల అధిపతులను కలిశారు. బీహార్‌లోని పాట్నా పర్యటన రక్షణ మంత్రి సింగ్ రద్దు చేసుకున్నారు.
సౌత్ బ్లాక్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇక్కడ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)తో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. పెరిగిన ఉద్రిక్తతల మధ్య ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడం, తదుపరి చర్యలను ప్లాన్ చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది.
"రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు, పశ్చిమ సరిహద్దులో భద్రతా పరిస్థితి, భారత సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు" అని రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.
"ఈ సమావేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ హాజరయ్యారు" అని అది తెలిపింది.
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ భారీ దాడులకు పాల్పడటం, అనేక సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులను విఫలం చేయడంతో దేశ రాజధానిలో వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి.
Raksha Mantri Shri @rajnathsingh today chaired a high-level meeting at South Block, New Delhi to review the security situation along the western border and operational preparedness of the Indian #ArmedForces. Chief of Defence Staff General Anil Chauhan, Chief of the Army Staff… pic.twitter.com/M9MtlyVYAJ
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 9, 2025
కీలకమైన సైనిక స్థావరాలు, పట్టణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌ల దాడిని భారత్ విజయవంతంగా అడ్డుకున్న కొన్ని గంటల తర్వాత ఈ సమావేశం జరిగింది. గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించడంతో రాత్రిపూట నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌ను టార్గెట్ చేసుకుంది పాకిస్థాన్ అయితే భారతదేశ రక్షణ వ్యవస్థలు, సాయుధ దళాలు వెంటనే స్పందించి ప్రతి చర్యలు చేపట్టాయి. వైమానిక దాడి మధ్య శ్రీనగర్, జమ్మూ , పంజాబ్, రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో విద్యుత్తు సరఫరా నిలిపేశారు. అనేక ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.
అంతే కాకుండా పాకిస్థాన్‌పై భారత దళాలు శక్తివంతమైన ప్రతీకార చర్య ప్రారంభించాయని, నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న అనేక పాకిస్తాన్ సైనిక పోస్టులు ధ్వంసం చేశాయని రక్షణ వ్యవస్థలోని వర్గాలు తెలిపాయి. శత్రువు స్థానాలను కూల్చివేసేందుకు యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు ఉపయోగించారు.
మే 8, 9 తేదీల రాత్రి మొత్తం పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ సాయుధ దళాలు "డ్రోన్లు, ఇతర పేలుడు సామగ్రిని ఉపయోగించి దాడులను" ప్రారంభించాయని భారత సైన్యం ఒక అధికారిక తెలిపారు. డ్రోన్ దాడులతో పాటు, పాకిస్తాన్ దళాలు జమ్మూ, కశ్మీర్‌లోని ఎల్‌ఓసి వెంబడి అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి కాల్పులు చేసినట్టు వెల్లడించారు.
"డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాల్పుల విరమణ ఉల్లంఘనను తగిన రీతిలో స్పందినట్టు " ఆర్మీ తన ప్రకటనలో నొక్కి చెప్పింది. "భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను నిలబెట్టడానికి కట్టుబడి ఉంది. ప్రతి శత్రు ప్రయత్నాన్ని అఖండ శక్తితో ఎదుర్కొంటుంది." అని వెల్లడించింది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సిందూర్ కింద సైనిక చర్య చేపట్టిన తర్వాత పాకిస్థాన్ దుశ్చర్యలకు దిగుతోంది.





















