అన్వేషించండి

పుల్వామా దాడి తరవాత మోదీ నా నోరు మూయించారు, రాహుల్ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు

Rahul Gandhi: రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ని ఇంటర్వ్యూ చేశారు.

Rahul Gandhi Interviews Satya Pal Malik: 

ఇంటర్వ్యూ చేసిన రాహుల్..

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Interview) ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik Interview)ని ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు సత్యపాల్ మాలిక్. పుల్వామా దాడులతోపాటు అదానీ వ్యవహారం, మణిపూర్ హింస, కులగణన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. 2019లో జరిగిన పుల్వామా దాడికి (Pulwama Attack) కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని మరోసారి మండి పడ్డారు. వ్యవస్థ విఫలం కావడం వల్లే 40 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చిందని మండి పడ్డారు. భద్రతా పరమైన లోపాలను ఎత్తి చూపినందుకు ప్రధాని నరేంద్ర మోదీ తనను మౌనంగా ఉండాలని హెచ్చరించినట్టూ ఆరోపించారు. 

"పుల్వామా దాడి ఎందుకు జరిగిందని నన్ను చాలా మంది అడిగారు. ఆ సమయంలో సైనికులు 5 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కావాలని అడిగారు. ఒకవేళ వాళ్లు నన్ను అడిగి ఉంటే నేను వాళ్లకు కచ్చితంగా వాటిని ఏర్పాటు చేసే వాడిని. ఓ సారి కొంత మంది విద్యార్థులు మంచులో చిక్కుకుపోతే ప్రత్యేకంగా ఎయిర్‌క్రాఫ్ట్ పంపి వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేలా చొరవ తీసుకున్నాను. ఢిల్లీలో ఎయిర్‌క్రాఫ్ట్‌లను చాలా సులభంగా అద్దెకి తీసుకోవచ్చు. కానీ హోం శాఖ మాత్రం సైనికుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఇవ్వలేదు. చేసేదేమీ లేక వాళ్లంతా రోడ్డు మార్గంలోనే వెళ్లారు"

- సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ 

మాట్లాడనివ్వలేదు..

పుల్వామా దాడి జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో (PM Modi) మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ అప్పుడు సాధ్యపడలేదని వివరించారు సత్యపాల్ మాలిక్. ఆ తరవాత మోదీయే కాల్ చేసి మాట్లాడినట్టు చెప్పారు. మన తప్పిదం వల్లే అంత మంది చనిపోయారని మోదీతో వాదించినట్టు తెలిపారు.

"పుల్వామా దాడి జరిగినప్పుడు మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఆ తరవాత సాయంత్రం మోదీ నాతో ఫోన్‌లో మాట్లాడారు. మన తప్పిదం వల్ల ఇదంతా జరిగిందని చెప్పాను. ఈ విషయంలో ఎక్కడా ఏమీ మాట్లాడొద్దని ఆయన నాకు చెప్పారు. ఆ తరవాత అజిత్ దోవల్‌ నాకు కాల్ చేశారు. ఆయన కూడా నన్ను వారించారు. కానీ అప్పటికే నేను మీడియాతో మాట్లాడాను. నా వ్యాఖ్యల వల్ల విచారణ తప్పుదోవ పట్టే అవకాశముందని అనుకున్నాను. కానీ అసలు విచారణే జరగలేదు. ఆ తరవాత మోదీ వచ్చి ప్రసంగించి దాన్ని కూడా రాజకీయం చేసుకున్నారు"

- సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ 

మణిపూర్ హింసపై..

మణిపూర్ హింసపైనా మాట్లాడారు సత్యపాల్ మాలిక్. ప్రభుత్వం కల్పించుకోనంత వరకూ అక్కడ ప్రశాంతంగానే ఉందని, ఆ తరవాతే అల్లర్లు మొదలయ్యాయని ఆరోపించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చి చెప్పారు. కుల గణనపైనా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కీలకమైన సమస్యల్ని చర్చించకుండా దాటవేస్తోందని విమర్శించారు. అదానీ వ్యవహారంపైనా నోరు మెదపడం లేదని మండి పడ్డారు. ప్రజలు తమ డబ్బంతా అదానీ వద్దే ఉందన్న ఆందోళనలో ఉన్నారని, రూ.20 వేల కోట్ల వ్యవహారం గురించి మాట్లాడితే మౌనంగా ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

Also Read: NCERT పుస్తకాల్లో ఇండియాకి బదులుగా 'భారత్‌' పేరు, ప్యానెల్ కీలక నిర్ణయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget