GOATతో నేను.. Lionel Messiతో రాహుల్ గాంధీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ వీడియో
Rahul Gandhi With Lionel Messi | హైదరాబాద్ లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి ఘన స్వాగతం లభించింది. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కూడా మెస్సీని కలిశారు.

Lionel Messi in Hyderabad | హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఆస్వాదించారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. మెస్సీని కలిసేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు వస్తున్నారు. కోల్‌కతాలో ఇదే సీన్ చూశాం. అయితే హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం ఈ సందర్భంగా మెస్సీని కలిశారు. మెస్సీ GOAT ఇండియా టూర్ 2025 కోసం భారతదేశానికి వచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఈవెంట్ తర్వాత శనివారం సాయంత్రం మెస్సీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో మెస్సీ, మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు స్వాగతం పలికారు.

సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ, మెస్సీల భేటీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో మెస్సీ, ఇంటర్ మయామి టీమ్, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లతో కలిసి ఉన్న రీల్‌ను షేర్ చేశారు. వీడియో పోస్టుకు 'GOAT మెస్సీతో Viva ఫుట్‌బాల్’ అని రాసుకొచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు తన జెర్సీ నెంబర్ 10ను అర్జెంటీనా ప్లేయర్ లియోనెల్ మెస్సీ అందజేశారు. దాంతో ప్రముఖ నేత అయినప్పటికీ రాహుల్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముగ్గురు ఆటగాళ్లతో పాటే గేమ్ ఆడిన బాలురతో కలిసి ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇందులో 'ది బ్యూటిఫుల్ గేమ్' అని రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. ఈ మ్యాచులో రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన ఆర్ఆర్ జట్టు మెస్సీ ప్రాతినిథ్యం వహించిన అపర్ణ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచులో రేవంత్ చేసిన గోల్ వైరల్ అవుతోంది.
View this post on Instagram
ప్రేక్షకులను మనసుల్ని గెలుచుకున్న మెస్సీ
కోల్‌కతా కార్యక్రమంలో జరిగిన గందరగోళానికి పూర్తి భిన్నంగా, హైదరాబాద్ కార్యక్రమం మెస్సీ మనసును గెలుచుకుంది. న్యూస్ ఏజెన్సీ PTI ప్రకారం, అర్జెంటీనా ఫుట్‌బాలర్ మెస్సీ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఫుట్ బాల్ గేమ్ ఆడిన బాలురతో కొన్ని టిప్స్ షేర్ చేసుకున్నారు. ఆట పట్ల వారికి మరింత అవగాహన కల్పించి నూతనోత్సాహాన్ని నింపారు.
మెస్సీ సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ సీఎం రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. సాకర్ ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటీనా కెప్టెన్ మెస్సీకి ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతించారు. మెస్సీ మాట్లాడుతూ, 'మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయతల మధ్య హైదరాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది' అన్నారు.
జెర్సీలో కనిపించిన సీఎం రెడ్డి
మెస్సీ క్రేజ్ హైదరాబాద్‌ను ఊపేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెర్సీ ధరించి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. స్టార్ ప్లేయర్ మెస్సీతో పాటు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ పెనాల్టీ షూటౌట్‌లో పాల్గొన్నారు.






















