By: Ram Manohar | Updated at : 07 Jul 2023 11:31 AM (IST)
సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ వేసిన పిటిషన్‌ని గుజరాత్ హైాకోర్టు తిరస్కరించింది.
Rahul Gandhi Defamation Case Verdict:
పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్‌కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేయగా...దాన్ని గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. 2019 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై ఓ బీజేపీ ఎంపీ సూరత్ కోర్టుని ఆశ్రయించారు. రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు..ఈ ఏడాది మార్చి 23న రాహుల్‌ని దోషిగా తేలుస్తూ సంచలన తీర్పునిచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అప్పటి నుంచి రాహుల్ దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే...సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ...కోర్టు మాత్రం ఆ పిటిషన్‌ని నిరాకరించింది. జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్‌తో కూడిన సింగిల్ బెంచ్ దీన్ని కొట్టివేసింది. ఇదే కేసులో లోక్‌సభ సభ్యత్వమూ కోల్పోయారు రాహుల్. అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధం మరో స్థాయికి చేరుకుంది. చెప్పాలంటే...విపక్షాలన్నీ ఒక్కటైంది కూడా అప్పుడే. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని...కాంగ్రెస్‌తో విభేదాలున్న పార్టీలూ వ్యతిరేకించాయి. ఇదంతా కేవలం కుట్రపూరితంగా చేసిందే అని కాంగ్రెస్ గట్టిగానే వాదిస్తోంది.
Gujarat High Court upholds Sessions Court's order denying stay on conviction of Rahul Gandhi in the defamation case against 'Modi surname' remark. pic.twitter.com/Qzw15PE0Ij
— ANI (@ANI) July 7, 2023
అంతా చట్ట ప్రకారమే..
ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 8 (3) ప్రకారం...ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు లేదా సభ్యురాలు ఏదైనా నేరంలో దోషిగా తేలినా, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడినా ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా...లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌పై చర్యలు తీసుకున్నారు. ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలూ ఉన్నాయి. అయితే...ఈ తీర్పుపై న్యాయ పోరాటం కొనసాగించేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్. ఒకవేళ పైకోర్టులో ఊరట లభిస్తే రాహుల్ అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ సూరత్ కోర్టు తీర్పుని ఏ హైకోర్టు కూడా కొట్టివేయలేదంటే మరో 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నీ కోల్పోతారు రాహుల్. కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో భయపడేదే లేదు అని తేల్చి చెబుతోంది.
అసలేంటీ కేసు..?
ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన క్రమంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది" అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. బీజేపీ తీవ్రంగా దీనిపై మండి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు...రాహుల్‌కు శిక్ష విధించింది.
Also Read: World Richest Beggar: బిచ్చగాడు నెం.1 - సాఫ్ట్వేర్లను తలదన్నే సంపాదన, కోట్ల రూపాయల ఆస్తులు
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
CLAT Result 2024: క్లాట్-2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండిలా
Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి
Look Back 2023: 2023ని మర్చిపోలేని విధంగా చేసిన ఉత్తరకాశీ సొరంగం ఘటన - పాఠాలు నేర్పిన ప్రమాదం
Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
/body>