Phone Scroll Psychology Habit: పొద్దున్నే ఫోన్ చూస్తున్నారా? ఇది కేవలం అడిక్షన్ మాత్రమే కాదు.. దీని వెనుక దాగున్న సైకాలజీ ఇదే!
Psychology: నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్ చెక్ చేయడం స్మార్ట్‌ఫోన్ వ్యసనం మాత్రమే కాదు. మెదడు ప్రవర్తన, హాబిట్ లూప్, అనిశ్చితి తగ్గింపుపై సైకాలజిస్టులు చెప్తున్న ఆసక్తికర విషయాలు ఇవిగో

Psychology behind checking phone morning: ఉదయాన్నే అలారం మోగగానే దాన్ని ఆపి, మంచం మీద నుంచి లేవకముందే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఈమెయిల్స్ , నోటిఫికేషన్లు చెక్ చేయడం మనలో చాలామందికి అలవాటుగా మారింది. కళ్లు తెరవగానే ఫోన్ చేతిలోకి తీసుకోవడం కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ అడిక్షన్', స్వీయ నియంత్రణ లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతోందని అందరూ అనుకుంటారు. కానీ, హ్యూమన్ సైకాలజీ ప్రకారం దీని వెనుక మెదడు పనిచేసే తీరు, ప్రవర్తనా సంబంధిత సూత్రాలు దాగి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
మనం నిద్రపోతున్నసమయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆరాటం
మనం నిద్రపోతున్న సమయంలో ప్రపంచం మనకంటే ముందే ముందుకు సాగిపోతుంది. రాత్రికి రాత్రే ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకోవాలనే మెదడు తీవ్రమైన ఆరాటాన్ని సైకాలజీలో అనిశ్చితి తగ్గింపు అంటారు. మనం లేవగానే ఆఫీస్ ఈమెయిల్స్ వచ్చాయా, ఎవరైనా మెసేజ్ చేశారా, ఈరోజు వాతావరణం ఎలా ఉందనే విషయాలను తెలుసుకోవడం ద్వారా రోజంతా ఏమి జరగబోతోందో ఒక అంచనాకు రావడానికి మెదడు ప్రయత్నిస్తుంది. మనస్సులో ఏర్పడే అనిశ్చితిని తక్షణమే తగ్గించుకోవడానికి స్మార్ట్‌ఫోన్ ఒక సులువైన సాధనంగా మారుతుంది.
రోజువారీ పనుల ప్రాాధాన్యతకు ఓ అలవాటు
దీనికి తోడు ప్రవర్తనా సైకాలజీలో ప్రతిపాదించిన హాబిట్ లూప్ ఈ అలవాటును మరింత బలోపేతం చేస్తుంది. ఒకే వాతావరణంలో పదే పదే ఒక పనిని చేయడం వల్ల అది మెదడులో ఆటోమేటిక్ అలవాటుగా మారిపోతుంది. నిద్రలేవడం , ఫోన్ చెక్ చేయడం , అందులో కొత్త సమాచారాన్ని, మెసేజ్‌ను చూడటం అనే క్రమం రోజువారీ లూప్గా మారుతుంది. ఈ క్రమంలో నిరంతరం పొందే అంచనా వేయలేని రివార్డులు మెదడును ప్రతిరోజూ ఉదయాన్నే ఆ రివార్డ్ కోసం ఫోన్ వైపు లాగుతాయి.
అలవాటుగా మారడం
మరో ప్రధానమైన కారణం రి-ఓరియంటేషన్ . సుదీర్ఘ నిద్ర తర్వాత బాహ్య ప్రపంచంతో తెగిపోయిన అనుబంధాన్ని మళ్లీ వేగంగా పునరుద్ధరించుకోవడానికి మనుషులు సహజంగా చేసే ప్రయత్నమిది. సమయం ఎంతైంది, ఇవాళ్టి మొదటి మీటింగ్ ఎప్పుడు ఉందనే సమాచారాన్ని సేకరించి రోజువారీ ప్రణాళికను సిద్ధం చేసుకోవడాన్ని సైకాలజిస్టులు ఓరియంటేషన్ బిహేవియర్ గా వర్ణిస్తారు. అంటే ఇది కేవలం వినోదం కోసమే కాకుండా రోజంతా సిద్ధమవ్వడానికి మెదడు చేసే ఒక ప్రయత్నం.
అలా చూడటం తప్పేమీ కాదు..కానీ !
అయితే, ఉదయాన్నే ఫోన్ చూడటం అడిక్షన్ కాకపోయినప్పటికీ, అది పూర్తిగా ఆరోగ్యకరమైన అలవాటు అని చెప్పలేం. పొద్దున్నే చూసే 5 నిమిషాల గ్లాన్స్ కాస్తా 45 నిమిషాల ఎండ్లెస్ స్క్రోలింగ్‌గా మారితే అది మీ రోజారీ ఉత్పాదకత, శ్రద్ధ మరియు మానసిక ప్రశాంతతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఉదయాన్నే ఫోన్ పట్టుకోవాలనే ఆలోచన రావడం మెదడు సహజత్వమే అయినప్పటికీ, దాన్ని ఎంత సమయం వాడుతున్నామనే దానిపై నియంత్రణ కలిగి ఉండటం చాలా అవసరం.
ట్రెండింగ్ వార్తలు





















