By: Ram Manohar | Updated at : 27 Aug 2023 02:28 PM (IST)
ఢిల్లీలోని మెట్రో స్టేషన్ల వద్ద ఖలిస్థాన్‌కి మద్దతుగా నినాదాలు కనిపించడం అలజడి రేపింది. (Image Credits: ANI)
Delhi Metro Stations:
గోడలపై నినాదాలు..
ఢిల్లీలో ఖలిస్థాన్ మద్దతుదారులు అలజడి సృష్టించారు. మెట్రో స్టేషన్ల వద్ద గోడలపై యాంటీ ఇండియా స్లోగన్స్ రాశారు. "ఢిల్లీ బనేగా ఖలిస్థాన్" అని పలు చోట్ల రాశారు. దాదాపు ఐదు మెట్రో స్టేషన్ల వద్ద ఈ నినాదాలు కనిపించాయి. Sikhs For Justice (SFJ)కి చెందిన కార్యకర్తలే ఈ పని చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నినాదాలు కనిపించిన ప్రతి చోటా ఈ కార్యకర్తలు కనిపించారని, అందుకే వాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నామని వెల్లడించారు. పలు చోట్ల ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు రాశారు. మోదీ సిక్కులను ఊచకోత కోశారని మండి పడ్డారు. ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ పలు చోట్ల గోడలపై పెద్దగా రాశారు. ఢిల్లీలో సెప్టెంబర్ 8-10వ తేదీల మధ్యలో G 20 సదస్సు జరగనుంది. ఇలాంటి కీలక సమయంలో ఈ నినాదాలు కనిపించడం సంచలనమైంది.
In more than 5 metro stations somebody has written 'Delhi Banega Khalistan and Khalistan Zindabad'. Delhi Police is taking legal action against this: Delhi Police pic.twitter.com/T6U5myjZyv
— ANI (@ANI) August 27, 2023
"G 20 సదస్సుకి సమయం దగ్గర పడుతున్న కావాలనే ఇలా అలజడి సృష్టించారు. సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) ఇలా గోడలపై స్లోగన్స్ రాసింది. దీనికి సంబంధించిన ఫుటేజ్‌ని కూడా విడుదల చేసింది. శివాజీ పార్క్ నుంచి పంజాబీ బాగ్ వరకూ చాలా చోట్ల మెట్రో స్టేషన్ల వద్ద SFJ కార్యకర్తలు కనిపించారు"
- ఢిల్లీ పోలీసులు
అప్రమత్తమైన పోలీసులు..
#WATCH | Pro-Khalistan slogans written on the wall of Shivaji Park Metro station are being removed by the Delhi Police https://t.co/2mcKBfqJw3 pic.twitter.com/Qug5YB3kMf
— ANI (@ANI) August 27, 2023
వీటిని గుర్తించిన వెంటనే పోలీసులు గోడలపై ఉన్న నినాదాలను తొలగించారు. ఈ ఏడాది జూన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పంజాబ్‌లోని ఫరిద్‌కోట్‌లో సెషన్స్ కోర్టు జడ్జ్ ఇంటి గోడలపైనా ఇలాంటి నినాదాలు రాశారు. అంతకు ముందు మే నెలలో హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఖలిస్థాన్ మద్దతుదారులు అలజడి సృష్టించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ఖలిస్థాన్ జెండాలు ఎగరేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో అమెరికాలో సిక్స్ ఫర్ జస్టిస్ ఏర్పాటైంది. సిక్కుల కోసం ప్రత్యేకంగా ఖలిస్థాన్‌ని ఏర్పాటు చేయాలన్నదే వీరి డిమాండ్. ఇండియా నుంచి పంజాబ్‌ని వేరు చేయాలని డిమాండ్ చేస్తూ 2020లో ఉద్యమం మొదలు పెట్టారు.
Ahead of the G20 Summit, Sikhs For Justice (SFJ) released raw footage of Delhi metro stations where Khalistan pro slogans are written. SFJ activists were present in multiple metro stations in Delhi from Shivaji Park to Punjabi Bagh with pro-Khalistan slogans: Delhi Police
— ANI (@ANI) August 27, 2023
Also Read: Loksabha Election 2024: రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి, తేల్చి చెప్పిన అశోక్ గహ్లోట్
US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
Kerala: కేరళలో ఆర్మీ జవానుపై దుండగుల దాడి, తీవ్రంగా కొట్టి వీపుపై 'PFI' ముద్ర
Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?
C-295 MW: భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ తొలి విమానం
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>