అన్వేషించండి

మోదీ అంటే ఏంటో ప్రజలకు అర్థమైంది, మూడోసారీ నన్నే ఎన్నుకుంటారు - ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

PM Modi: మూడోసారి కూడా తమకే ప్రజలు అధికారం కట్టబెడతారని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

PM Modi: 


ఇంటర్వ్యూలో ప్రధాని కీలక వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది మోదీ సర్కార్. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడోసారి కూడా  ప్రజలు తననే ఎన్నుకుంటారని, ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సమయం, అనుభవం...ఇవే ప్రతి మనిషికి గురువులు అని, అవే పాఠాలు నేర్పుతాయని అన్నారు. 2014లోనే మోదీ అంటే ఎవరికీ తెలియదని, అయినా ప్రజలు తనను నమ్మి ఓటు వేసి గెలిపించారని వెల్లడించారు. 

"2014లో నరేంద్ర మోదీ అంటే ఎవరో ప్రజలకు తెలియదు. అయినా అంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు. పదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రతి చోటా మోదీనే వాళ్లు చూస్తున్నారు. చంద్రయాన్ మిషన్‌, అమెరికా పర్యటనతో నా గురించి వాళ్లు తెలుసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా వాళ్లకు నేనేంటో అర్థమైంది. వచ్చే ఎన్నికల్లోనూ వాళ్లు సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం నాకుంది"

- ప్రధాని నరేంద్ర మోదీ 

ఇదే ఇంటర్వ్యూలో ఉచిత హామీల గురించి ప్రస్తావించారు మోదీ. ఆర్థిక వ్యవస్థ విషయంలో బాధ్యత లేకుండా వ్యవహరించే పార్టీలు, ప్రభుత్వాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. ఇలాంటి విధానాల వల్ల భవిష్యత్‌లో చాలా సమస్యలు ఎదురవుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే ఇది మూడో స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు కాబట్టే ఇది సాధ్యమవుతుందని అన్నారు. 

"ప్రజలకు మా మీదున్న నమ్మకం చిన్నదేమీ కాదు. ఒక్కసారి కాదు. రెండు సార్లు మాకు భారీ మెజార్టీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా తొలి ప్రాధాన్యత. అంతకన్నా ముఖ్యమైంది ఏంటంటే...భవిష్యత్‌ గురించి ఆలోచించి సరైన ప్రణాళికలతో ముందుకెళ్లడం. స్థిరత్వాన్ని సాధిస్తే ప్రతి రంగంలోనూ అద్భుతాలు జరుగుతాయి. మన దేశంలో ప్రస్తుతం బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. 2014లో నేను అధికారంలోకి వచ్చినప్పుడు ఏ దేశం కూడా నమ్మలేదు. మన బ్యాకింగ్ వ్యవస్థపై వాళ్లకు విశ్వాసం లేదు. కానీ...ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి"

- ప్రధాని నరేంద్ర మోదీ 

లోక్‌సభ ఎన్నికల్లో NDA,I.N.D.I.A తలపడనున్నాయి. విపక్ష కూటమిలో 26 పార్టీలున్నాయి. మోదీ సర్కార్‌ని ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే...ఈ మధ్య కాలంలో వచ్చిన సర్వేలన్నీ మోదీకి అనుకూలంగానే ఉన్నాయి.  Pew Research Center సర్వేలో 79% మంది భారతీయులు ప్రధాని మోదీకి మద్దతునిచ్చారు.  

సెలవు తీసుకోకుండా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి వివరించాల్సి వచ్చినప్పుడు చాలా మంది చెప్పేది ఆయన దినచర్య గురించి. రోజులో ఎక్కువ సమయంలో ఆయన విధుల్లోనే ఉంటారని అంటారు. రోజుకు 17 నుంచి 18 గంటలు పని చేస్తారని చెబుతారు. ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయం తాజాగా అధికారికంగా స్పందించింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అంటే గత 9 ఏళ్లుగా మోదీ ఒక్కటంటే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయమే చెప్పుకొచ్చింది.సమాచార హక్కు చట్టం కింద పుణేకు చెందిన వ్యవస్థాపక కార్యకర్త ప్రఫుల్ సి సర్దా అడిగిన ప్రశ్నలపై పీఎంవో సమాధానం ఇచ్చింది. 2014 భారత ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పీఎం మోదీ ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారని పీఎంవోను ఆయన అడిగారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం.. ప్రధాని మోదీ 2014 నుంచి ఒక్క సెలవు కూడా తీసుకోలేదని వెల్లడించింది.

Also Read: మాకో మాటైనా చెప్పాలిగా, ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి? ప్రధానికి సోనియా గాంధీ లేఖ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Embed widget