By: Ram Manohar | Updated at : 23 Sep 2023 03:04 PM (IST)
వారణాసిలోని అంతర్జాతీయ క్రికెట్ మైదాన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. (Image Credits: ANI)
International Cricket Stadium:
శంకుస్థాపన..
ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ మైదాన నిర్మాణానికి ( international cricket stadium) శంకుస్థాపన చేశారు. ప్రధాని సొంత నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయిలో మైదానాన్ని నిర్మిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు క్రికెట్ లెజెండ్స్ రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ గవాస్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
#WATCH | PM Modi lays the foundation stone of an international cricket stadium in Uttar Pradesh's Varanasi pic.twitter.com/5sAh2wZ5eA
— ANI (@ANI) September 23, 2023
కేంద్రం చెబుతున్న వివరాల ప్రకారం...30 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేడియం నిర్మించనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ.450 కోట్లు ఖర్చు పెడుతోంది. శివుడి స్ఫూర్తితోనే ఈ మైదానాన్ని నిర్మిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. నెలవంక ఆకారంలో రూఫ్ కవర్‌లు, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్ లైట్స్, ఘాట్ స్టెప్స్ ఆకృతిలో సీటింగ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి 30 వేల మంది ఆడియెన్స్ కూర్చుని మ్యాచ్‌ని చూసేందుకు వీలుగా నిర్మించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రకంగా మరోసారి తన సొంత నియోజకవర్గమైన వారణాసికి వచ్చే అవకాశం దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 గురించి మరోసారి ప్రస్తావించారు. భారత్ రోవర్ చంద్రుడిపై దిగి నెల రోజులవుతోందని గుర్తు చేశారు.
"ఈ రకంగా వారణాసికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ్టికి చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయి నెల రోజులవుతోంది. రోవర్ శివశక్తి పాయింట్‌కి చేరుకుంది. చంద్రుడిపై ఓ శివశక్తి పాయింట్ ఉంటే ఈ కాశీలో మరో శివశక్తి పాయింట్ సిద్ధమవుతోంది. ఈ మైదానమే శివశక్తి పాయింట్. ఈ మైదానానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఆ మహాదేవుని నగరంలో నిర్మించిన ఈ మైదానాన్ని ఆ శివుడికే అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మైదానం ద్వారా ఎంతో మంది క్రీడాకారులకు మేలు జరుగుతుందని అన్నారు. శంకుస్థాపన చేయడంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మాట్లాడారు. స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగానే ఈ స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఇది సాధ్యమైంని ప్రశంసించారు. యూపీలో ఇది మూడో అంతర్జాతీయ మైదానం అని చెప్పిన యోగి ఆదిత్యనాథ్, BCCI సూపర్‌విజన్‌లో కడుతున్న తొలి స్టేడియం అని స్పష్టం చేశారు.
#WATCH | Varanasi, UP: "In Varanasi, a stadium is under construction with the help of the Smart City Mission of the Central Government. This is the third International stadium of Uttar Pradesh and the first to be constructed under the supervision of BCCI. It will provide a… pic.twitter.com/a4RYYFIi7n
— ANI (@ANI) September 23, 2023
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ప్రధాని మోదీకి "NAMO" జెర్సీ కానుకగా ఇచ్చారు.
#WATCH | Sachin Tendulkar with PM Modi and CM Yogi Adityanath at the event to mark the foundation stone laying of an international cricket stadium in Varanasi, UP pic.twitter.com/TjgIHNrelD
— ANI (@ANI) September 23, 2023
Also Read: అది మోదీ మల్టీప్లెక్స్, మరీ ఇరుగ్గా గజిబిజిగా ఉంది - కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై కాంగ్రెస్ సెటైర్లు
GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే
BJP MPs Resign: ఒకేసారి 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా, కారణం ఏంటంటే!
Pakistan-Occupied Kashmir: పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికీ మనదే - పార్లమెంట్లో అమిత్‌షా కీలక ప్రకటన
Cyclone Michaung Effect: ఏటా చెన్నైని వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి? ఆ ఒక్క తప్పే ముప్పుగా మారిందా?
NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
/body>