PM Modi Nominations: నామినేషన్‌కు ముందు దశ అశ్వమేథ ఘాట్, కాల భైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
Varanasi News: నామినేష్‌కు ముందు దశ అశ్వమేథ ఘాట్, కాల భైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ ఫైల్ చేశారు.
Narendra Modi Pooja: గంగాసప్తమి రోజున ఏం తలుచుకున్న జరుగుతుందని పండితుల మాటల ప్రకారం మోదీ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. అంతకంటే ముందు ఆయన అస్సీఘాట్‌లో ప్రత్యేక పూజలు జేశారు. దశ అశ్వమేథ ఘాట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక హారతి ఇచ్చారు. వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య మోదీ గంగాదేవికి చీరసారే సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు.
VIDEO | Lok Sabha Elections 2024: PM Modi (@narendramodi) performs Ganga Poojan at Dashashwamedh Ghat, Varanasi, ahead of filing his nomination for the Lok Sabha election from the constituency.#LSPolls2024WithPTI #LokSabhaElections2024
— Press Trust of India (@PTI_News) May 14, 2024
(Full video available on PTI Videos -… pic.twitter.com/YNJgGQD5Lo
క్రూయిజ్ షిప్‌లో దశ అశ్వమేథ ఘాట్‌కు వెళ్లారు మోదీ.
#WATCH | Uttar Pradesh: Prime Minister Narendra Modi boards a cruise ship at Dasaswamedh Ghat in Varanasi.
— ANI (@ANI) May 14, 2024
PM Narendra Modi will file his nomination for #LokSabhaElections2024 from Varanasi today. pic.twitter.com/eqknZdzY5b
అక్కడి నుంచి కాల భైరవ ఆలయానికి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడ కూడా ప్రత్ేక పూజలు చేశారు. అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు వారణాసి కలెక్టరేట్‌కు వెళ్లారు.
ప్రధాని మోదీ నామినేషన్‌లో మద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన వారిలో సంజయ్ సోంకర్ ఉన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. "నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నాలాంటి చిన్న కార్యకర్తకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు." అని అన్నారు.
#WATCH | Varanasi, UP: Proposer for PM Narendra Modi's nomination, Sanjay Sonkar says, "... We got the information in the morning. I have been doing whatever work was assigned to me as a worker of the party. I am grateful to the party for giving me such a big responsibility..." pic.twitter.com/19QPGr51pF
— ANI (@ANI) May 14, 2024
భారీ ఎత్తన రోడ్‌షో
అట్టహాసంగా నామినేషన్ వేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతకు ముందు భారీ రోడ్‌షో చేయనున్నారు. సుమారు ఆరు కిలోమీటర్ల సాగనుందీ యాత్ర. ఈ రోడ్‌షోలో మోదీకి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ ప్రత్యేక ఏర్పాట్వలు చేసింది.
నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేది వీళ్లే
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్
బిహార్ సీఎం నితీశ్‌కుమార్
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి
మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే
రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ
అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ
హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ
గోవా సీఎం ప్రమోద్ సావంత్
సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్
త్రిపుర సీఎం మాణిక్ సాహా
అమిత్‌షా ,
రాజ్‌నాథ్ సింగ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్
లోక్‌దళ్ అధినేత జయంత్ చౌదరి
ఎల్జీపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్
అప్నాదళ్ చీప్ అనుప్రియ
ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్
మోదీ నామినేషన్ ప్రక్రియోల పాల్గొనేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వారణాసి చేరుకున్నారు. నామినేషన్ అనంతరం జరిగే ఎన్డీఏ భేటీలో కూడా ఇద్దరు నేతలు పాల్గొంటారు. తమ అభిప్రాయాలను చెప్పనున్నారు. నిన్న రాత్రే పవన్ కల్యాణ వారణాసి చేరుకోగా ఈ ఉదయం బయల్దేరిన చంద్రబాబు వెళ్లారు.
"ఇది ఒక చారిత్రకమైన రోజు. వారణాసి పవిత్రమైన స్థలం. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. గత 10 సంవత్సరాలలో ఆయన చాలా బాగా పని చేశారు. దేశానికి మోదీ అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని... చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
#WATCH | Varanasi, Uttar Pradesh: Former Andhra Pradesh CM and TDP chief N Chandrababu Naidu says "It is a historical occasion. It is a holy place. PM Modi is going to become the Prime Minister for the third time. He has done extremely well in the last 10 years. The country needs… pic.twitter.com/0aDEUa6DYi
— ANI (@ANI) May 14, 2024