PM Narendra Modi: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇంటికెళ్లిన మోదీ ఏం చేశారంటే?
Mini Diwali: అయోధ్యలోని రామాలయం గర్భగుడిలో శ్రీరాంలల్లా నూతన విగ్రహ ప్రతిష్ఠాపన సోమవారం అంతరంగ వైభవంగా పూర్తయింది.
Mini Diwali In Narendra Modi House: అయోధ్యలోని రామాలయం (Ayodhya Ram Mandir) గర్భగుడిలో శ్రీరాంలల్లా నూతన విగ్రహ ప్రతిష్ఠాపన (Ram Lalla Pran Pratishtha) సోమవారం అంతరంగ వైభవంగా పూర్తయింది.
బాలరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు. దేశ విదేశాలలో లక్షలాది మంది రామభక్తులు వేడుకలకు తరలివచ్చారు.
దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీపాలు వెలిగించారు. అయోధ్యలో సరయు నదీ తీరాన దీపోత్సవం నిర్వహింన్నారు.
అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో 'మినీ దీపావళి' జరుపుకున్నారు.
అయోధ్య ఆలయం నుంచి తీసుకొని వచ్చిన రాముని ఫోటో ముందు రామ్ జ్యోతి (Ram Jyoti) పేరుతో మట్టి దీపాలు వెలిగించారు.
रामज्योति! #RamJyoti pic.twitter.com/DTxg2QquTT
— Narendra Modi (@narendramodi) January 22, 2024
దీనికి సంబంధించిన ఫొటోలను X లో పంచుకున్నారు. అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన నివాసంలో 'రామ్ జ్యోతి'ని వెలిగించారు.
अयोध्या धाम में आज रामलला अपने नव्य, दिव्य और भव्य मंदिर में विराजमान हुए हैं। सारा देश दीपावली मना रहा है। इस पावन अवसर पर अपने परिवार के साथ मिलकर, घर में राम ज्योति प्रज्वलित की।
— Rajnath Singh (@rajnathsingh) January 22, 2024
प्रधानमंत्री श्री @narendramodi का आह्वान है कि आप भी अपने घरों में रामज्योति प्रज्वलित कर प्रभु… pic.twitter.com/QudcKSt09c
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన నివాసంలో దీపాలు వెలిగించారు. దివ్యాంగ విద్యార్థులతో కలిసి మంత్రి, ఆయన కుటుంబం సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజలకు సంబంధించిన వీడియలోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
📍 नागपुर आवास
— Nitin Gadkari (@nitin_gadkari) January 22, 2024
परिजनों तथा कर्ण बधीर स्कूल के छात्रों के साथ श्री रामरक्षा पाठ और प्रभु श्रीराम जी की आरती।#ShriRam #RamMandir #RamMandirPranPratistha #JaishreeRam #जयश्रीराम #राम_का_भव्य_धाम pic.twitter.com/RwQKh741zm