అన్వేషించండి

Parliament winter session 2025: పార్లమెంట్ సమావేశాలు- SIRపై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్.. ప్రభుత్వ వ్యూహమేంటి?

Delhi Terror Blast | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగాలని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాలతో చర్చలు జరుపుతామన్నారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 1, 2025) ప్రారంభం అయ్యాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 14 కొత్త బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. వాటిని పూర్తి మెజారిటీతో ఆమోదించాలని కేంద్రం యోచిస్తోంది. మరోవైపు, దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పునరీక్షణ (SIR) ప్రక్రియతో పాటు ఢిల్లీ ఉగ్రదాడిపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి SIR అంశంపై చర్చకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి.  

ఇటీవల చనిపోయిన ఎంపీలతో పాటు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో చనిపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. వరల్డ్ కప్ నెగ్గిన భారత మహిళల జట్టు, అంధుల టీ20 వరల్డ్ కప్ నెగ్గిన మహిళల జట్టును మోదీ అభినందించారు. 

పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టనున్న 14 బిల్లులు ఇవే

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుండి డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. ఇందులో మొత్తం 15 సమావేశాలు ఉంటాయి. ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వం పౌర అణు రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడం సహా 14 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో బీమా చట్టం (insurance Act), దీపావళి చట్టం, కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీల మార్కెట్, జాతీయ రహదారులు, ఉన్నత విద్యా కమిషన్, అటామిక్ ఎనర్జీ, GST,  జాతీయ భద్రతకు సంబంధించిన సెస్‌ బిల్లులు ఉన్నాయి.

  • జన విశ్వాస్ (సవరణ) బిల్లు, 2025
  • దివాలా మరియు దివాలా-బ్యాంక్రప్సీ చట్టం (సవరణ) బిల్లు, 2025
  • మణిపూర్ వస్తువులు మరియు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు, 2025
  • రద్దు మరియు సవరణ బిల్లు, 2025
  • జాతీయ రహదారులు (సవరణ) బిల్లు, 2025
  • అణు శక్తి బిల్లు, 2025
  • కార్పొరేట్ చట్టం (సవరణ) బిల్లు, 2025
  • సెక్యూరిటీల మార్కెట్స్ కోడ్ బిల్లు, 2025
  • బీమా చట్టం (సవరణ) బిల్లు, 2025
  • మధ్యవర్తిత్వం మరియు సయోధ్య (సవరణ) బిల్లు, 2025
  • ఉన్నత విద్యా కమిషన్ బిల్లు, 2025
  • కేంద్ర ఎక్సైజ్ సుంకం (సవరణ) బిల్లు, 2025
  • ఆరోగ్య భద్రత మరియు జాతీయ భద్రత సెస్‌ బిల్లు, 2025
  • సంవత్సరం 2025–26 కోసం మొదటి అనుబంధ గ్రాంట్ల డిమాండ్లు

పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగాలని, ప్రతిష్టంభనను నివారించడానికి ప్రతిపక్షాలతో చర్చించడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఆదివారం (నవంబర్ 30)న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ తరువాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, మేము ప్రతిపక్షాల మాట వినడానికి సిద్ధంగా ఉన్నామని, పార్లమెంట్ అందరిదీ అని పేర్కొన్నారు. 

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాల వ్యూమాలు

ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్‌వాదీ పార్టీ, DMKతో సహా పలు పార్టీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. కనుక ఈ శీతాకాల సమావేశాలలో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశాలున్నాయి. 

ముందుగా, దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ, చర్చించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతాయి. అయితే, SIR అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడానికి వీలులేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించి, ఓట్లు దొంగిలించారని ప్రతిపక్షాలు కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. SIR పేరుతో వెనుకబడిన, దళితులు, అణగారిన మరియు పేద ఓటర్లను జాబితా నుంచి తొలగించి తమకు నచ్చిన విధంగా ఓటర్ల జాబితాను తయారు చేస్తోందని వారు అంటున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Sky Walk Bridge: దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Sky Walk Bridge: దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
Year Ender 2025: ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
స్టైలిష్ లుక్ తో వస్తున్న New Gen Seltos.. లాంచ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి
స్టైలిష్ లుక్ తో వస్తున్న New Gen Seltos.. లాంచ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి
Embed widget