Parakram Diwas 2023: స్వాతంత్య్రం వచ్చాక నేతాజీని మరిచిపోయే ప్రయత్నం చేశారు- పరాక్రమ్ దివాస్ సందర్భంగా ప్రధాని మోదీ కామెంట్స్
అండమాన్ నికోబార్‌లోని 21 ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
Parakram Diwas 2023: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకుని అండమాన్ నికోబార్‌లోని 21 ప్రధాన దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం చేశారు. ఇకపై ఈ దీవులను పరమవీర చక్ర పురస్కార విజేతల పేర్లను ఈ దీవులకు పెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టారు. మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్ అండ్ హోనీ కెప్టెన్ (అప్పటి లాన్స్ నాయక్) కరమ్ సింగ్, 2వ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్, కంపెనీ హవల్దార్ మేజర్ పిరు సింగ్, కెప్టెన్ GS సలారియా, లెఫ్టినెంట్ కల్నల్ (అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా, సుబేదార్ జోగిందర్ సింగ్, మేజర్ షైతాన్ సింగ్, అబ్దుల్ హమీద్, లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజర్ హోషియార్ సింగ్, 2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయబ్ సుబేదార్ బనా సింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, సుబేదార్ మేజర్ (అప్పటి రైఫిల్‌మ్యాన్) సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ రిటైర్డ్ (హానీ కెప్టెన్) గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్”అని పీఎంవో పేర్కొంది.
126వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు హోంమంత్రి అమిత్ షా పోర్ట్ బ్లెయిర్ వెళ్లారు. దీన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ 21 దీవులను ఇకపై పరమవీర చక్ర పురస్కార విజేతల పేర్లతో పిలుస్తారు. ఈ రోజును రాబోయే తరాలు స్వాతంత్ర్య అమృత కాలంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా గుర్తుంచుకుంటాయన్నారు ప్రధాని. ఈ ద్వీపాలు మన భవిష్యత్ తరాలకు శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
'అండమాన్లోని ఈ భూమిలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అక్కడి జైలలోని ప్రతి అణువూ ఆనాటి బాధ వివరిస్తూనే అపూర్వమైన భావోద్వేగం స్వరాలు వినిపిస్తాయి. స్వాతంత్య్రానంతరం నేతాజీని మరిచిపోయే ప్రయత్నం జరిగింది. ఈ స్మారక చిహ్నం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. అని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. వాస్తవానికి నేతాజీ జయంతిని పురస్కరించుకుని జనవరి 23న 'పరాక్రమ్ దివస్'గా జరుపుకుంటారు.
सभी 21 परमवीर...सबके लिए एक ही संकल्प था- राष्ट्र सर्वप्रथम! India First! pic.twitter.com/4LarHjMkU1
— PMO India (@PMOIndia) January 23, 2023
భారత సైన్యంలోని మూడు విభాగాలకు ఈ రోజు చాలా ముఖ్యం: అమిత్ షా
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని పురస్కరించుకుని అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఎగురవేశారు. 'భారత సైన్యం త్రివిధ దళాలకు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. నేడు అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 అతిపెద్ద దీవులకు 21 మంది పరమవీర చక్ర విజేతల పేర్లు పెట్టడం వారి జ్ఞాపకాలను పునరుద్ధరించడానికి ప్రధాన మంత్రి చొరవ తీసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ కృషితో నేతాజీ దేశానికి విముక్తి కల్పించేందుకు ప్రయత్నించినప్పుడు, ఈ ప్రాంతానికి దేశంలోనే తొలిసారి స్వాతంత్ర్యం వచ్చిన ఘనత దక్కింది, నేతాజీ హస్తం తొలిసారిగా ఈ ద్వీపంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిందన్నారు.
1943 డిసెంబర్ 30న అండమాన్ నికోబార్ దీవుల్లో నేతాజీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నేడు అదే వేదికపై అమిత్ షా జెండా ఎగురవేశారు. ఈ మైదానం పేరు ఇప్పుడు 'నేతాజీ స్టేడియం'గా పిలుస్తున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో పలువురు స్వాతంత్ర్య సమరయోధులు ఉన్న సెల్యులార్ జైలును కూడా అమిత్ షా సందర్శించే అవకాశం ఉంది.