Viral Video : బుడ్డోడే కానీ ఆత్మాభిమానంలో తగ్గేదేలే - అప్పడాలు అమ్మే పిల్లవాడికి ఫ్రీగా డబ్బులిస్తే ఏమన్నాడో తెలుసా..
Viral Video : బీచ్ దగ్గర కూర్చొని ఉన్న అప్పడాలమ్మే ఓ కుర్రాడు చెప్పిన సమాధానం అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : కొన్నిసార్లు మనం పెరిగిన వాతావరణం, బాధ్యతలు మన ప్రవర్తనను నిర్ణయిస్తాయి. మనం పెరిగిన పరిస్థితులను బట్టి ఆలోచనా తీరు ఉంటుంది. దానికి చదువుతో పనిలేదు. కొందరు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ మాట, నడవడిక మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉండదు. కానీ కొందరు మాత్రం చదువుకోకపోయినా ఇతరులతో నడుచుకునే విధానంలో మాత్రం ఎంతో ఎత్తులో ఉంటారు. అలా చిన్న వయసులోనే బరువు, బాధ్యతలు మోస్తూ బతుకునీడుస్తోన్న వాళ్లు దేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి ఎవరైనా ఏం పని చేయకపోయినా డబ్బులిస్తామంటే కాదనకుండా ఉండలేరు. ఎందుకంటే వారున్న పరిస్థితుల్లో తప్పదు గనుక. కానీ అదే పరిస్థితుల్లో ఉన్న ఓ పిల్లాడు మాత్రం అలా డబ్బులిస్తానంటే వద్దంటున్నాడు. పని చేసుకుని సంపాదిస్తానని, ఇలా ఫ్రీగా వచ్చే డబ్బు తనకొద్దని చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
కష్టపడి పనిచేసే వాళ్లకు ఎవరి దగ్గరా చేయి చాచడం ఇష్టముండదు. వచ్చిన కొంచెం లాభంలోనే సంతోషంగా గడిపేస్తుంటారు. ఆత్మాభిమానంతో, స్వతంత్రంగా జీవించేందుకే ఆసక్తి చూపుతారు. సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొందరు చిన్న వయసులోనే బాధ్యతలు మోయడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియోలోనూ బీచ్ లో అప్పడాలు అమ్ముకుంటోన్న ఓ కుర్రాడు అదే స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. అతన్ని చూసిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. బాలుడితో చేసిన సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.
View this post on Instagram
వైరల్ వీడియోలో ఏముందంటే..
ఇన్‌స్టాగ్రామ్‌లో 'యూనిక్ వైరల్ ట్రస్ట్ (YouNick Viral Trust)' పోస్ట్ చేసిన ఈ వీడియో కుర్రాడు బీచ్ పక్కన కూర్చున్నట్టు చూపిస్తోంది. అతని వద్దకు వెళ్లిన ఇన్ఫ్లుయెన్సర్ తో తాను ఇప్పటివరకు ఒక్క అప్పడం కూడా అమ్మలేదని చెప్పాడు. అయితే తాను కొంటానని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో ఒక్కో అప్పడాల ప్యాకెట్ ధర రూ.30 అని కుర్రాడు చెప్పాడు. ఆ వ్యక్తి రూ.5కే కొంటానని చెప్పడంతో కుర్రాడు అంగీకరించలేదు. దీంతో ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ``నీకు మీ అమ్మంటే ఇష్టమా అని అడిగాడు. ఇష్టమేనని పిల్లవాడు చెప్పడంతో మా అమ్మకి ఈ అప్పడాలంటే చాలా ఇష్టం. నా తల్లి నీ తల్లి కాదా?`` అని అడిగేసరికి ఆ కుర్రాడు రూ.30 విలువైన అప్పడాలను రూ.5కే ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ మళ్లీ వెనక్కి వచ్చి ఆ కుర్రాడికి రూ.500 ఇచ్చాడు. ఆ డబ్బులను తీసుకునేందుకు బాలుడు మొదట ఒప్పుకోలేదు. నేను పని చేస్తున్నాను. కానీ అడుక్కోను అని చెప్పడం అందరి హృదయాలనూ కట్టిపడేస్తుంది. కష్టపడకుండా, మోసం చేసి డబ్బు సంపాదించాలనుకునే వారికి ఈ కుర్రాడి మాటలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి.
ఈ వీడియోకు ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అనేక మంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. కుర్రాడిది మంచి మనసు, గోల్డెన్ హార్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని సంస్కారాన్ని మెచ్చుకుని కొనియాడుతున్నారు.
Also Read : Viral News : తండ్రి వాచ్ మెన్ గా పనిచేసిన 5స్టార్ హోటల్ కే విందుకు తీసుకెళ్లిన కొడుకు.. పోస్ట్ వైరల్





















