అలాంటి ఒప్పందమేమీ లేదు, హఫీజ్‌ని భారత్‌కి అప్పగించడంపై పాక్ సాకులు
Hafiz Saeed: హఫీజ్ సయీద్‌ని అప్పగించేందుకు వీలుగా రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని పాకిస్థాన్ తేల్చి చెప్పింది.
Extradition of Hafiz Saeed:
పాక్ ఏం చెప్పిందంటే..
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ని (Hafiz Saeed) తమకు అప్పగించాలని పాకిస్థాన్‌ని ఇప్పటికే రిక్వెస్ట్ చేసింది భారత్. దీనిపై చర్చలు జరుగుతుండగానే పాక్ బదులిచ్చింది. భారత్ తమను ఈ విషయమై సంప్రదించినట్టు ధ్రువీకరించింది. అయితే...ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందం కుదరలేదని తేల్చి చెప్పింది. 2008లో ముంబయి దాడుల కీలక సూత్రధారి హఫీజ్ సయీద్. మరి కొన్ని ఉగ్రదాడుల్లోనూ ప్రధాన నిందితుడుగా (Hafiz Saeed extradition ) ఉన్నాడు. ఇప్పటికే భారత్‌లోని దర్యాప్తు సంస్థలన్నీ హఫీజ్‌ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించాయి. అందుకే అతడిని భారత్‌కి అప్పగించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బగ్చీ పాకిస్థాన్‌కి వినతి పంపారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్‌లనూ పంపారు. అయితే..పాకిస్థాన్ మీడియా వివరాల ప్రకారం...ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ స్పందించారు. మనీలాండరింగ్ కేసులో హఫీజ్‌ని అప్పగించాలని భారత్ కోరినట్టు వివరించారు. కానీ..రెండు దేశాల మధ్య అలాంటి ఒప్పందం లేనందు వల్ల అప్పగించలేకపోతున్నామని స్పష్టం చేశారు. నిజానికి ఇలాంటి ఒప్పందం లేకుండా అప్పగించేందుకు అవకాశముంటుందన్న వాదన వినిపిస్తోంది. పాకిస్థాన్ కావాలనే భారత్ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 2019 జులైలో Counter Terrorism Department (CTD) సయీద్‌ని అదుపులోకి తీసుకుంది. అతడిపై మొత్తం 23 FIRలు నమోదయ్యాయి. యాంటీ టెర్రరిజం కోర్టు 2022 ఏప్రిల్‌లో హఫీజ్ సయీద్‌కి 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది.