SC on Covid-19 Vaccine: వ్యాక్సినేషన్‌పై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం- టీకా తీసుకోవాలని ఒత్తిడి చేయొద్దు
SC on Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.
SC on Covid-19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ టీకా వేసుకోవాలని ప్రజలపై ఒత్తిడి చేయవద్దని సుప్రీం ఆదేశించింది. ప్రస్తుత వ్యాక్సినేషన్ విధానం ఏకపక్షంగా ఉందని కూడా చెప్పలేమని పేర్కొంది. వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది.
Nobody can be forced to get COVID-19 vaccination, says SC
— ANI Digital (@ani_digital) May 2, 2022
Read @ANI Story | https://t.co/gD1xXWAFkm#COVID #CovidVaccine #vaccine #SupremeCourt pic.twitter.com/MrWoaXzCRb
కరోనా కేసులు
దేశంలో కొవిడ్ ఉధృతి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. వరుసగా ఐదో రోజు కూడా 3 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కొత్తగా 3157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 26 మంది మరణించారు.
- యాక్టివ్ కేసులు: 19,500
- మొత్తం మరణాలు: 5,23,869
- రికవరీలు: 4,25,38,976
- మొత్తం కేసులు: 4,30,82,345
ప్రస్తుతం దేశంలో 19,500 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,30,82,345 కేసులు నమోదయ్యాయి. 5,23,869 మరణాలు సంభవించాయి. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. తాజాగా కరోనా నుంచి 2723 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,38,976కు చేరింది.