By: ABP Desam | Updated at : 09 Jun 2023 06:30 AM (IST)
చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్ దంపతుల కుమార్తె వివాహం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ కుమార్తె పరకాల వాంగ్మయి వివాహం గురువారం (జూన్ 8) జరిగింది. బెంగళూరులోని ఓ ఇంట్లో వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. పరకాల వాంగ్మయి వివాహం నిరాడంబరంగా జరిగిందని, ఇందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని చెబుతున్నారు.
ఈ వివాహ వేడుకలో రాజకీయ ప్రముఖులు కనిపించలేదు. పరకాల వాంగ్మయి భర్త పేరు ప్రతీక్. ఆర్థిక మంత్రి కుమార్తె వివాహం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం, ఉడిపి అడమరు మఠం సాధువుల ఆశీస్సులతో జరిగింది.
ఆర్థిక మంత్రి కుమార్తె వివాహానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేసిన విషయం తెలిసిందే. వేద మంత్రాలు వీడియోలో వినవచ్చు. పక్కనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. సింపుల్ వెడ్డింగ్ వేడుకను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం బెంగళూరులో జరిగిందని దీపక్ కుమార్ అనే యూజర్ ట్వీట్ చేశారు. నిరాడంబర జీవనం అనే ప్రథమ సూత్రాలతో పనిచేయడానికి ఇదొక ఉదాహరణ అన్నారు ఆయన.
🎊 Union Finance Minister Nirmala Sitharaman's daughter got married in Bangalore yesterday. 🎉🎉 The news was not on TV or on print media. An example of simple living and working with nation first principles. 🙏🙏🙏 pic.twitter.com/r818unikZP
— Deepak Kumar. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩💪 (@DipakKumar1970) June 8, 2023
వంగమయి జర్నలిస్ట్
పరకాల వాంగ్మయి వృత్తిరీత్యా మల్టీమీడియా జర్నలిస్ట్. మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్‌లో బీఎం, ఎంఏ చేశారు. లైవ్ మింట్, ది వాయిస్ ఆఫ్ ఫ్యాషన్, ది హిందూ వంటి సంస్థలతో కలిసి పనిచేశారు.
Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్
ICG Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
IFFCO Notification: ఇఫ్కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
One Nation One Election: కోవింద్ అధ్యక్షతన తొలి భేటీ- పార్టీలు, లా కమిషన్ సూచనలు ఆహ్వానించనున్న ప్యానెల్
అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, స్టాలిన్ సంచలన నిర్ణయం
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
/body>