Court Verdict: యువతిని ‘ఐటెమ్’ అని పిలిచిన యువకుడు, స్పెషల్ కోర్టు సంచలన శిక్ష
ఈ కేసు జూలై 2015 నాటిది. తాజాగా ముంబయిలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది.
Mumbai Special Court Verdict: ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో 25 ఏళ్ల యువకుడికి ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, ఆ అమ్మాయిని యువకుడు ‘ఐటెమ్’ అని అన్నాడు. అలా సంబోధించినందుకే కోర్టు ఈ శిక్ష వేసింది. అమ్మాయిని ‘ఐటెమ్’ అనడం అగౌరవం అని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. బాలికను 'ఐటెమ్' అని పిలిచి జుట్టు లాగడం ఐపిసి సెక్షన్ 354 ప్రకారం శిక్షార్హమైన నేరమని కోర్టు పేర్కొంది.
లైవ్ లా రిపోర్ట్ చేసిన వివరాల ప్రకారం.. ఈ కేసులో విచారణ సందర్భంగా, ప్రత్యేక న్యాయమూర్తి ఎస్జె అన్సారీ ఇలా అన్నారు. ‘ఐటెమ్’ అనేది సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలను అవమానకరమైన రీతిలో సంబోధించడానికి ఉపయోగించే పదం, ఇది వారిని లైంగికంగా వర్ణిస్తుంది. స్త్రీ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మహిళలను అన్యాయం, అగౌరవం నుంచి కాపాడేందుకు ఇలాంటి వేధింపులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నందున ఇలాంటి నేరాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని న్యాయమూర్తి అన్నారు.
ఏడు సంవత్సరాల నాటి కేసు
ఈ కేసు జూలై 2015 నాటిది. 16 ఏళ్ల బాధితురాలు ఆ ఘటనకు నెల రోజుల ముందు ముంబయిలోని సకినాకాకు వెళ్లింది. నిందితుడైన బాలుడు దారిలో వెళ్తున్న అమ్మాయిలను ఆటపట్టించేవాడు. నిందితుడు బాధితురాలిని తరచూ ఫాలో అవుతూ పదే పదే ఆమెను ‘ఐటెమ్’ అని పిలిచేవాడు. నిందితుడితో పాటు అతని గుంపులోని ఇతర అబ్బాయిలు కూడా బాధితురాలిని చెడు దృష్టితో చూసేవారు. నివేదికల ప్రకారం, జూలై 14, 2015 న, బాధితురాలు పాఠశాల నుండి తిరిగి వస్తుండగా, నిందితుడు ఆమె జుట్టును వెనుక నుండి లాగి.. ‘ఐటెమ్ ఎక్కడికి వెళ్తుంది’ అని అన్నాడు.
దీంతో విస్తుపోయిన బాధితురాలు పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ '100' కు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చే సమయానికి నిందితుడు అబ్రార్ ఖాన్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో నలుగురి వాంగ్మూలం తీసుకున్నారు. సెక్షన్ 354 కింద కేసు నమోదైంది. ఒక మహిళ గౌరవం, గౌరవానికి భంగం కలిగించే చెడు ఉద్దేశంతో ఆమెపై దాడి లేదా బలవంతం చేసిన సందర్భాలలో భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 354 ఉపయోగిస్తారు.
నిందితుడి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నిందితుడిని తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. నిందితులు, బాధితురాలు స్నేహితులని, బాధితురాలి తల్లిదండ్రులు వారి ఫ్రెండ్ షిప్ పట్ల అసంతృప్తిగా ఉన్నందున అతనిపై తప్పుడు కేసు పెట్టారని న్యాయవాది వాదించారు. అయితే ఇది కోర్టులో రుజువు కాలేదు. ఈడీ కేసులో నిందితుడిని ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది.
పూర్తి జడ్జిమెంట్ చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి