Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితా- భారత్ కు ప్లేస్ ఉందా!
Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ఇండియాలోని 3 నగరాలు టాప్ 172 ఖరీదైన నగరాల్లో స్థానం దక్కించుకున్నాయి.
Most Expensive Cities: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రెండు నగరాలకు ఏడాది పొడవునా పర్యటకులు వస్తుంటారు. ఈ నగరాల్లో జీవించాలంటే కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
వరల్డ్ వైడ్ ఆఫ్ లివింగ్ సంస్థ ఈ సర్వే చేపట్టింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 172 ప్రధాన నగరాల్లో సగటు జీవన వ్యయం 8.1 శాతం పెరిగింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ వంటివి ఈ నగరాల్లో జీవన వ్యయం పెరగడానికి కారణాలు అయ్యాయని ఆ నివేదిక వెల్లడించింది.
మాస్కో ర్యాంకింగ్ లో భారీ మార్పు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ తదితర కారణాల వల్ల ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో పెద్ద మార్పు వచ్చింది. గతేడాది ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టెల్ అవీవ్ ఈసారి మూడో స్థానానికి దిగిపోయింది. రష్యా రాజధాని మాస్కో మరియు ఆస్ట్రేలియా నగరమైన సెయింట్ పీటర్స్‌బర్గ్ ర్యాంకింగ్‌లో మార్పు జరిగింది. విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా ఈ రెండింటి ర్యాంకులు దిగజారాయి. మాస్కో 88 ర్యాంకులు, సెయింట్ పీటర్స్ బర్గ్ 70 ర్యాంకింగ్స్ కిందికి దిగాయి.
ప్రపంచంలోని 10 అత్యంత ఖరీదైన నగరాలు
న్యూయార్క్
సింగపూర్
టెల్ అవీవ్
హాంకాంగ్
లాస్ ఏంజిల్స్
జ్యూరిచ్
జెనీవా
శాన్ ఫ్రాన్సిస్ స్కో
పారిస్
సిడ్నీ
కోపెన్ హాగన్
ప్రపంచంలోని 10 చౌకైన నగరాలు
కొలంబో
బెంగళూర్
అల్జీర్స్
చెన్నై
అహ్మాదాబాద్
అల్మాటీ
కరాచీ
తాష్కెంట్
ట్యూనిస్
టెహ్రాన్
ట్రిపోలీ
డాష్మిక్
టాప్ 100 ఖరీదైన నగరాల్లో భారత్ కు నో ప్లేస్
భారతదేశంలోని ఏ నగరం కూడా టాప్ 100 ఖరీదైన నగరాల్లో చోటు సంపాదించలేదు. అయితే ఇండియాలోని 3 నగరాలు టాప్ 172 ఖరీదైన నగరాల్లో స్థానం దక్కించుకున్నాయి. అవి బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్. ఇతర చోట్ల కనిపించే ధరల పెరుగుదలను నివారించే ధోరణి కారణంగా ఆసియా నగరాల్లో జీవన వ్యయంలో సగటు పెరుగుదల కేవలం 4.5% మాత్రమే పెరిగిందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ విధానాలు మరియు కరెన్సీ కదలికల కారణంగా వివిధ దేశాల పనితీరు మారుతూ ఉంటుంది.
ఈ జాబితాలో బెంగళూరు 161వ స్థానంలో నిలిచింది
మన దేశం నుంచి ఈ జాబితా నుంచి బెంగళూరు 161వ స్థానం, చెన్నై 164వ స్థానం, అహ్మదాబాద్ 165వ స్థానంలో ఉన్నాయి. నివేదిక ప్రకారం... ప్రపంచ ర్యాంకింగ్స్ లో టోక్యో, ఒసాకా వరుసగా 24, 33 స్థానాలు దిగజారాయి. వీటి ర్యాంకింగ్స్ పతనానికి తక్కువ వడ్డీ రేట్లు కారణమని తెలుస్తోంది.
S'pore ties New York as world's most expensive cities to live in: 2022 EIU report https://t.co/wwpH7cRfJg pic.twitter.com/HuX3hm4hrs
— Mothership.sg (@MothershipSG) December 2, 2022
New York, Singapore are the world’s most expensive cities right now pic.twitter.com/pm3sisGHHj
— Vikas Muley (@drvikasm) December 1, 2022