Middle Class India: 2030 నాటికి భారత్‌లో సగానికి పైగా మిడిల్ క్లాస్ ప్రజలే- సర్వేలో ఆసక్తికర విషయాలు
2030 నాటికి భారతదేశంలో సగానికి పైగా మిడిల్ క్లాస్ ప్రజలే ఉంటారని, ఎన్నో మార్పులు వస్తున్నాయని తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

న్యూఢిల్లీ: 2030 నాటికి దేశ జనాభాలో సగానికి పైగా మధ్యతరగతి వారే ఉంటారని ఓ సర్వేలో వెల్లడైంది.
బోటిక్ కల్చరల్ స్ట్రాటజీ సంస్థ ఫోక్ ఫ్రీక్వెన్సీ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. క్యాజువల్ డైనింగ్ +49 శాతం, ఫైన్ డైనింగ్ (+55 శాతం) వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. తాము ఎదగాలని మధ్యతరగతి వారు తరతరాలుగా భావిస్తున్నారు. ఆ కుటుంబాలలో బాగా చదువున్న వారు, లేక ఉద్యోగాలు, ఇతర పని చేస్తున్న తొలివారం వారు అధికం కానున్నారు.
భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారులలో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలు, టైర్-2+ నగరాల్లో నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ మెట్రో నగరాలు, ఇంగ్లీష్ మాట్లాడేవారికి అనుకూలంగా కంటెంట్ నిర్ణయాలు ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. ప్రాంతీయ భాషలకు ప్రతికూలంగా AI టెక్నాలజీ వినియోగంతో పెద్ద లక్ష్యాలు పెట్టుకున్ని వాటిని సాధించడం వీలు కావడం లేదని రిపోర్ట్ చేసింది.
జాతీయ విద్యా విధానం (NEP) 2020 మార్గదర్శాల ద్వారా ఉన్నత విద్యలో గణనీయమైన మార్పులు వచ్చాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రధాన లక్ష్యం 2035 నాటికి 50 శాతం గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తి (GER) సాధించడం. 2018లో ఇది 26.3 శాతం కాగా, గణనీయమైన పెరుగుదల సూచించింది.
దేశంలో అక్షరాస్యత రేటు క్రమంగా పెరుగుతోంది. 2011లో 22.5 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం 2019లో 10.2 శాతానికి తగ్గింది. మెరుగైన అక్షరాస్యతతో పెను మార్పులు సాధ్యం. అది ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుంది. అందుకే ప్రజలు ఇప్పుడు పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు అధిక ఉత్పత్తి, నాణ్యతా ప్రమానాలు కోరుకుంటున్నారు.
ఆర్థిక శక్తిగా మహిళల ఎదుగుదల
భారత్‌లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులలో సగానికి పైగా మహిళలున్నారు. 14 శాతం వ్యాపారాలు మహిళల నేతృత్వంలో జరుగుతున్నాయి. లగ్జరీ మార్కెట్స్, సింగిల్ మాల్ట్ విక్రయాలలో మహిళలు 64 శాతం వృద్ధిని సాధించారు. మహిళల కోసం కొత్తగా ఉత్పత్తులు రావడం, వారికి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. అందంతో పాటు మహిళలకు అవసరమైన ఇతర ఉత్పత్తులలో వారికి ప్రాధాన్యం పెరిగింది.
మన దేశంలో జనరేషన్ జెడ్, ఆల్ఫాలో దాదాపు 93 శాతం మంది కుటుంబంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థిరత్వంతో పాటు విలువలను ఆశిస్తున్నారు. యువత చదువుతో పాటు సోషల్ మీడియా ప్రభావంతో పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నారు. అందువల్ల భారత సంస్కృతి, విలువలకు, తరతరాల నుంచి వస్తున్న ఆచారాలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. కొందరు మన చరిత్రను తిరిగి చూస్తున్నారు. విషయాలు తెలుసుకుని తాము నమ్మిన దాని కోసం ఎంతవరకైనా వెళ్తున్నారు. అనైతిక ప్రవర్తనకు శిక్ష తప్పదు. అలాంటి విధానాలతో బిజినెస్, బ్రాండ్ వాల్యూ సైతం దెబ్బతింటుంది.
ఫోక్ ఫ్రీక్వెన్సీ ఫౌండర్ అభిప్రాయం ఇదీ..
సంస్కృతి, డేటా, బిజినెస్ వ్యూహాల మధ్య ఎంత అంతరం ఉందో ప్రత్యక్షంగా చూశానని ఫోక్ ఫ్రీక్వెన్సీ ఫౌండర్, ఆంథ్రపాలజిస్ట్ గాయత్రి సప్రూ తెలిపారు. ఎన్నో విశ్లేషణలు ఉన్నప్పటికీ వాటిపై లోతుగా అధ్యయనం చేయకపోవడం, చర్చలు జరగని కారణంగా వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి నివేదికల ద్వారా భవిష్యత్తులో బ్రాండ్ల ఔచిత్యాన్ని, విలువల్ని నిరూపించుకోవడంలో దోహదం చేస్తాయని పేర్కొన్నారు.






















