Manipur Violence: మణిపూర్ అల్లర్లలో చైనా హస్తం ఉంది, సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Manipur Violence: మణిపూర్ అల్లర్లలో చైనా హస్తం ఉందని సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Manipur Violence:
చైనాపై ఆరోపణలు..
ఉద్దవ్ బాల్ థాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ అల్లర్లలో చైనా హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చైనాకు వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకున్నారు..? అని ప్రశ్నించారు. "ఇది కచ్చితంగా ప్రీప్లాన్డ్" అని అన్నారు. చైనా కుట్ర పూరితంగా మణిపూర్‌లో అల్లర్లకు ఆజ్యం పోస్తోందని తేల్చి చెప్పారు. మణిపూర్ అల్లర్లలో విదేశీ హస్తం ఉందని బైరెన్ సింగ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలోనే సంజయ్ రౌత్ చైనా గురించి ప్రస్తావించడం కీలకంగా మారింది.
"మణిపూర్‌లో హింసకు కారణం చైనాయే. కేంద్ర ప్రభుత్వం ఆ దేశంపై ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. దాదాపు 40 రోజులుగా అక్కడ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. బాధితులంతా ఇళ్లు వదిలేసి రిలీఫ్ క్యాంప్‌లలో ఉంటున్నారు. దీనికి సీఎం బైరెన్ సింగ్ బాధ్యత వహించాలి. వెంటనే రాజీనామా చేయాలి. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి"
- సంజయ్ రౌత్, శివసేన నేత
#WATCH | China is involved in Manipur violence. What action did you (Central govt) take against China? He (Manipur CM) should resign and president's rule should be imposed there: Uddhav Thackeray faction leader and MP Sanjay Raut pic.twitter.com/0XWelH0fbR
— ANI (@ANI) July 2, 2023
ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించారు. అక్కడ రిలీఫ్ క్యాంప్‌లలో ఉన్న బాధితులను పరామర్శించారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
రాజీనామాపై క్లారిటీ..
రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని బైెరెన్ సింగ్‌పై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని రోజులుగా అల్లర్లు జరుగుతున్నా...పరిస్థితులు అదుపులోకి తీసుకురాలేకపోయారు బైరెన్ సింగ్. అధిష్ఠానం కూడా దీనిపై అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన గవర్నర్‌ని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన రాజీనామా చేస్తారన్న వార్త వినిపించింది. అయితే...ఆయన ఇంటి వద్దకు వందలాది మంది మహిళలు చేరుకున్నారు. రాజీనామా చేయొద్దంటూ నినదించారు. జనాల తాకిడి పెరుగుతుండటం వల్ల మరోసారి ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించారు. బైరెన్ సింగ్ మద్దతుదారులు కూడా ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు. ఆయన గవర్నర్‌తో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ...వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన రాజీనామా లేఖనీ చించేశారు. ఈ చించేసిన రిజిగ్నేషన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరవాత స్వయంగా బైరెన్ సింగ్ ట్విటర్ ద్వారా స్పందించారు. ఇలాంటి కీలక పరిస్థితుల్లో తాను రాజీనామా చేయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
At this crucial juncture, I wish to clarify that I will not be resigning from the post of Chief Minister.
— N.Biren Singh (@NBirenSingh) June 30, 2023
Also Read: ఢిల్లీలో హనుమాన్ ఆలయం కూల్చివేత, అక్రమ నిర్మాణమని తేల్చిన అధికారులు