News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Manipur Violence: అమిత్‌షా వార్నింగ్ ఎఫెక్ట్, ఇప్పటివరకు 140 ఆయుధాలు అప్పగించిన నిరసనకారులు

Manipur Violence: ఆయుధాలు సరెండర్ చేయాలని నిరసనకారులకు అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు 140 ఆయుధాలను అప్పగించారు.

FOLLOW US: 
Share:

Manipur Violence: కేంద్ర భద్రతా బలగాల నుండి ఆయుధాలు దొంగలించిన వారు వెంటనే వాటిని తిరిగి ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ ఫలితాన్నిస్తోంది. ఆయుధాలు అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా.. అమిత్ షా హెచ్చరికలు ఫలితాన్ని ఇచ్చాయి. మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 140కి పైగా ఆయుధాలను సరెండర్ చేశారని మణిపూర్ పోలీసులు తాజాగా ప్రకటించారు. అమిత్ షా హెచ్చరికల మేరకు ఆయుధాలను అప్పగించారని తెలిపారు. SLR 29, కార్బైన్, AK, INSAS రైఫిల్, INSAS LMG, .303 రైఫిల్, 9mm పిస్టల్, .32 పిస్టల్, గ్రెనేడ్ లాంచర్ సహా పలు ఆయుధాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినట్లు వెల్లడించారు. 

రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో కమిటీ..

మే 3వ తేదీ నుంచి మణిపూర్‌ అట్టుడుకుతోంది. గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రం పోలీసులు, భద్రతా బలగాల నిఘాలో ఉంది. ఎక్కడా మళ్లీ అల్లర్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మణిపూర్ పర్యటనకు వెళ్లి అక్కడి అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. పరిస్థితులు సమీక్షించారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గవర్నర్ నేతృత్వంలోనూ మరో కమిటీ ఏర్పాటు కానుంది. ఇదే విషయాన్ని అమిత్‌షా అధికారికంగా వెల్లడించారు. 

Also Read: Rahul Gandhi: 2 ఎఫ్ఐఆర్ లలో 15 లైంగిక వేధింపుల ఆరోపణలు, మోదీ రక్షణ కవచంలో బీజేపీ ఎంపీ- రాహుల్ ఫైర్

"గత నెల మణిపూర్‌లో అల్లర్లు జరిగాయి. దురదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. మణిపూర్‌లో మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటించాను. అధికారులతో భేటీ అయ్యాను. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఏం చేయాలో పరిశీలించాను. మైతేయ్, కుకీ వర్గాలకు చెందిన నేతలనూ కలిశాను. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ అవసరం. అందుకే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. గవర్నర్‌ నేతృత్వంలో మరో కమిటీ కూడా ఏర్పాటవుతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. ఎవరు ఈ కుట్ర చేశారన్నది వాళ్లు త్వరలోనే ఛేదిస్తారు. పారదర్శకంగా విచారణ జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ప్రజలంతా ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరి వద్దనైనా ఆయుధాలుంటే వెంటనే వాటిని పోలీసులకు అప్పగించండి" అని అమిత్ షా గురువారం రోజు కోరారు.

Published at : 02 Jun 2023 06:59 PM (IST) Tags: Amit Shah Manipur weapons violence Surrendered

ఇవి కూడా చూడండి

Money Laundering Case: తర్వాతి అరెస్ట్ కేజ్రీవాల్- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్!

Money Laundering Case: తర్వాతి అరెస్ట్ కేజ్రీవాల్- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్!

AYUSH NEET: ఆయుష్ నీట్ పీజీ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే

AYUSH NEET: ఆయుష్ నీట్ పీజీ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే

Maharashtra Hospital Deaths: మహారాష్ట్ర ఆస్పత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్‌

Maharashtra Hospital Deaths: మహారాష్ట్ర ఆస్పత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్‌

సోనియా గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ

సోనియా గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

టాప్ స్టోరీస్

Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్

Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్

Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Constable Results: తెలంగాణ  కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!