Delhi Airport: ఫోన్ కాల్‌లో "బాంబ్" ప్రస్తావన, బెదిరిపోయి ఫిర్యాదు చేసిన మహిళ - విస్టారా ఫ్లైట్‌లో ఘటన
Delhi Airport: ఫ్లైట్‌లో బాంబు గురించి ప్రస్తావిస్తూ కాల్ మాట్లాడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Delhi Airport:
విస్టారా ఫ్లైట్‌లో ఘటన..
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విస్టారా ఫ్లైట్ (Vistara Flight) ఎక్కిన ఓ ప్రయాణికుడు ఫోన్‌లో "బాంబ్" గురించి మాట్లాడటం పక్కనే కూర్చున్న మహిళా ప్యాసింజర్ విన్నారు. వెంటనే సిబ్బందికి సమాచారం అందించాడు. జూన్ 7వ తేదీన ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. యూపీలోని ఫిలిబిట్‌కు చెందిన అజీమ్ ఖాన్ అనే ప్రయాణికుడు ఈ పని చేసినట్టు చెప్పారు. దుబాయ్‌కి వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్తుండగా ఫోన్‌లో అవతలి వ్యక్తితో బాంబ్ గురించి ప్రస్తావిస్తూ చాలా సేపు మాట్లాడాడు. పక్కనే ఉన్న మహిళా ప్రయాణికురాలు భయపడిపోయి ఫ్లైట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వల్ల అంతా అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకూ సమాచారం అందించారు. ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది..ఆ తరవాత పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
A male passenger, identified as Azeem Khan of Pilibhit in Uttar Pradesh who was onboard a Vistara flight to Dubai, arrested at Delhi airport on a complaint by a woman co-passenger. The woman had complained to a flight crew member that she heard the man speak of a bomb over the…
— ANI (@ANI) June 9, 2023
ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్యాసింజర్..
విమానం గాల్లో ఉండగానే..ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్‌ని తెరవడం అందరినీ టెన్షన్ పెట్టింది. Asiana Airlines ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఉన్నట్టుండి ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు ఓ ప్రయాణికుడు. ఒక్కసారిగా ప్యాసింజర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. ఫ్లైట్ సేఫ్‌గానే ల్యాండ్ అయినప్పటికీ...డోర్ తెరవడం వల్ల గాలి గట్టిగా వీచి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ల్యాండ్ అయిన వెంటనే కొందరు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో Airbus A321-200లో 200 మంది ప్రయాణికులున్నారు. Daegu International Airport రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో ఇది జరిగింది. ఎమర్జెన్సీ డోర్‌కి పక్కనే కూర్చుని ఉన్న ఓ ప్రయాణికుడు ఫ్లైట్...నేలకు 650 అడుగుల ఎత్తులో ఉండగానే మాన్యువల్‌గా ఆ డోర్‌ని తీశాడు. అనుకోకుండా డోర్ ఓపెన్ అవడం వల్ల ప్రయాణికులంతా కంగారు పడ్డారు. శ్వాస తీసుకోవడంలో చాలా మంది ఇబ్బందికి గురయ్యారు. అయితే..ఎవరికీ గాయాలు అవ్వలేదని, ఫ్లైట్‌కి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదని ఏషియానా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. సౌత్‌కొరియాకు చెందిన Yonhap News Agency ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపింది.
Also Read: Donald Trump charged: ట్రంప్‌ని వదలని బ్యాడ్‌టైమ్, మరో కేసులో ఇరుక్కున్న మాజీ అధ్యక్షుడు