Viral Video: నడిరోడ్డుపై ఇంజనీర్‌ని నిలబెట్టి కొట్టిన ఎమ్మెల్యే, యూజ్‌లెస్ అంటూ తిట్లు
Viral Video: మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే జూనియర్ సివిల్ ఇంజనీర్‌ని నడిరోడ్డుపైనే చెంపదెబ్బ కొట్టింది.

Viral Video:
సోషల్ మీడియాలో వైరల్..
మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే ఇంజనీర్‌ని రోడ్డుపైనే నిలబెట్టి చెంప దెబ్బలు కొట్టడం సంచలనమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. జూనియర్ సివిల్ ఇంజనీర్ కాలర్ పట్టుకుని మరీ కొట్టారు ఎమ్మెల్యే గీతా జైన్ (Geeta Jain). థానే జిల్లాలోని మీరా భయందర్ ఎమ్మెల్యే అయిన ఆమె కొట్టడమే కాదు. "యూజ్‌లెస్" అంటూ గట్టిగా ఆ ఇంజనీర్‌పై అరిచింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ ఇంట్లోని వాళ్లను బయటకు పంపించి కూల్చేశారు. మహిళలు, చిన్నారులు రోడ్డున పడ్డారు. అక్కడే ఉండాలని అధికారులు హెచ్చరించి మరీ ఇల్లు కూల్చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఎమ్మెల్యే నడిరోడ్డుపైనే ఇంజనీర్‌ని నిలదీశారు. ఆ తరవాత చెంప దెబ్బ కొట్టారు. ఎందుకలా కొట్టారని మీడియా ప్రశ్నించగా...వివరణ ఇచ్చారు గీతా జైన్.
"ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేశారు. మహిళ, చిన్నారులు రోడ్డున పడ్డారు. ఇల్లు కూల్చేస్తుంటే వాళ్లు బోరున ఏడ్చారు. వాళ్లను చూసి ఈ సివిల్ ఇంజనీర్ నవ్వుకున్నాడు. అందుకే వెంటనే కొట్టాలనిపించింది. కొట్టాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా స్పందించడం చాలా సహజం. కేవలం ఓ బిల్డర్‌కి ఈ ఇల్లు అడ్డు తగులుతోందనే కూల్చేశారు తప్ప ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయినా...ఈ ఇంజనీర్ అత్యుత్సాహం చూపించి కూల్చేశారు"
- గీతా జైన్, ఎమ్మెల్యే
Meet MLA Geeta Jain, 50 khoke gang, acting like a hooligan rather than an elected representative. pic.twitter.com/ain6XdNClh
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 21, 2023
అంతే కాదు. ఇల్లు కూల్చేస్తున్న సమయంలో మహిళ అడ్డుకుందని, ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే గీతా జైన్. ఆ ఇంజనీర్‌ని కొట్టినందుకు ఎలాంటి రిగ్రెట్ లేదని తేల్చి చెప్పారు. ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తామని వెల్లడించారు.
"మొత్తం ఇద్దరు ఇంజనీర్‌లు కలిసి ఈ పని చేశారు. అసెంబ్లీలో కూడా ఈ అంశం గురించి ప్రస్తావిస్తాను. నాపైన కేసు పెడితే పెట్టనివ్వండి. దేన్నైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రైవేట్ ల్యాండ్‌లోని ఇంటితో అధికారులకు ఏం పని. అలా ఎలా కూల్చేస్తారు"
- గీతా జైన్, ఎమ్మెల్యే
#maharashtra #BJPMLAGeetaJain #BJPMLA
— santosh singh (@SantoshGaharwar) June 20, 2023
Mira Bhayander MLA Geeta Jain Slaps a Municipal Corporation employee in broad day light. pic.twitter.com/fTBdNt5tlc
అయితే..తప్పు చేస్తే పోలీసులకు చెప్పాలి కానీ..ఇలా చేయి చేసుకోవడం ఏంటి అని కొందరు విమర్శిస్తున్నారు. ఇదేం రౌడీయిజం అని మరి కొందరు మండి పడుతున్నారు. అటు ఎమ్మెల్యే మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. అలాంటి టైమ్‌లో అలాగే రియాక్ట్ అవ్వాలని తేల్చి చెబుతున్నారు. ఆమె చేయి చేసుకున్న తరవాత ఏం జరిగిందన్నది ఇంకా తెలియలేదు.
Also Read: International Yoga Day:ప్రపంచ ఉద్యమంగా యోగా, అమెరికా నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ





















