By: ABP Desam | Updated at : 05 Aug 2023 12:22 PM (IST)
Edited By: jyothi
స్నేహితుడి మెడను కొరికి రక్తం తాగబోయిన వ్యక్తి - తప్పించుకొని మళ్లీ వచ్చి ఫ్రెండును చంపిన యువకుడు! ( Image Source : Canva )
Maharashtra Crime News: నలుగురు స్నేహితులు కలిసి సరదాగా పార్టీ చేసుకోవాలనుకున్నారు. ఈక్రమంలోనే అందరూ కలిసి మద్యం తాగారు. ఫుల్లుగా తాగేసరికి ఒక్కొక్కరికి ఒంటిపై స్పృహ లేకుండా పోయింది. దీంతో నలుగురులో ఓ వ్యక్తి పక్కనే తన ఉన్న స్నేహితుడి రక్తం తాగాలనిపిస్తోందని చెప్పాడు. వెంటనే అతడి మెడను కొరికి రక్తం తాగబోయాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి.. కాసేపయ్యాక మళ్లీ తరిగి వచ్చాడు. నా మెడనే కొరుకి రక్తం తాగుతావా అంటూ అతడిని రాయితో కొట్టి చంపాడు.
అసలేం జరిగిందంటే..?
మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాహుల్ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లాడు. నలుగురూ కలిసి ఫుల్లుగా తాగారు. అయితే మద్యం మత్తులో ఇప్తియాన్ ఖాన్ అనే వ్యక్తి.. రాహుల్ రక్తం తాగాలనిపిస్తోందని చెప్పాడు. వెంటనే రాహుల్ మెడను కొరికాడు. రక్తం తాగే ప్రయత్నం చేశాడు. కానీ రాహుల్.. ఇప్తియాన్ ఖాన్ ను తోసేసి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని వెళ్లిపోయాడు.
అయితే కాసేపయ్యాక మళ్లీ ఇప్తియాన్ ఖాన్ ను కలిశాడు. నా మెడను కొరికి.. రక్తం తాగుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ఓ బండరాయి తీసుకొని దాడి చేయడం ప్రారంభించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇప్తియాన్ ఖాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలోనే నిందితుడు రాహుల్ ను అరెస్ట్ చేసినట్లు ఎంఐడీసీ భోసారి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్ స్పెక్టర్ రాజేంద్ర నికల్జే తెలిపారు.
ఇటీవలే కొడుకును చంపిన తండ్రి
కర్ణాటకలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ ఇంట్లో గొడవకు దిగిన యువకుడ్ని.. అతడి తండ్రి, సోదరుడు కలిసి కర్రతో కొట్టి చంపారు. అనంతరం ఇంటి వెనకాల స్థలంలో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. యువకుడి మృతి పట్ల అనుమానం వచ్చిన గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కర్రతలో బలంగా కొట్టి హత్య...
కర్ణాటక బెళగావి జిల్లా హిడ్కల్ గ్రామానికి చెందిన మహాలింగయ్య గురుసిద్ధయ్య హిరేమఠ్ (54) అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. మొదటివాడు బసయ్య హిరేమఠ్(26), రెండో కుమారుడు సోమయ్య మహాలింగయ్య (24). అయితే గురుసిద్ధయ్య చిన్న కుమారుడు సోమయ్య గత కొంత కాలంగా మద్యపానానికి అలవాటు పడ్డాడు. సోమయ్య రోజూ ఇంటికి తాగి వచ్చి గొడవ చేసేవాడు. రోజురోజుకూ సోమయ్య ప్రవర్తనతో కుటుంబ సభ్యులు విసుగుచెందారు. ఈ క్రమంలో జులై 10వ తేదీన సోమయ్య.. మద్యం తాగడానికి తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. మాటామాటా పెరిగి గొడవ తీవ్రమైంది. సోమయ్య తండ్రి గురుసిద్ధయ్య, తన పెద్ద కుమారుడు బసయ్య కలిసి.. అతడి తలపై కర్రతో బలంగా కొట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సోమయ్య అక్కడికక్కడే మరణించాడు.
ఇంటి వెనుకే అంత్యక్రియలు..
కొడుకు చనిపోయిన తర్వాత గురుసిద్ధయ్య తన ఇంటి వెనకాలే అంత్యక్రియలు నిర్వహించాడు. కానీ సోమయ్య మృతి పట్ల అనుమానంతో గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సంజీవ్ పాటిల్ ఘటనా స్థలికి చేరుకొని మృతుడి తండ్రిని, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం కాలిన మృతదేహం అవశేషాలను ల్యాబ్‌కు పంపారు.
SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
RRC: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
/body>