అన్వేషించండి

Maharashtra Political Crisis: క్లైమాక్స్ చేరిన మరాఠా రాజకీయం- అసెంబ్లీలో గురువారమే బలపరీక్ష

Maharashtra Political Crisis: మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగనుంది. ఈ మేరకు గవర్నర్ సీఎంకు లేఖ రాశారు.

Maharashtra Political Crisis: గత వారం రోజులుగా రసవత్తరంగా సాగుతోన్న మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి లేఖ రాశారు.

" రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 39 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎమ్‌వీఏ) ప్రభుత్వం నుంచి వైదొలగాలని చూశారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా నన్ను కలిశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి, బలపరీక్ష కోసం అడిగారు.                                               "
-భగత్ సింగ్ కోష్యారి, మహారాష్ట్ర గవర్నర్

5 గంటలకు

గురువారం సాయంత్రం 5 గంటలకు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని ఆదేశించారు. శివసేన పార్టీలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో బలపరీక్ష అనివార్యమైంది.

సుప్రీంలో సవాల్

గవర్నర్ ఆదేశాలపై శివసేన మండిపడింది. ఈ సమయంలో బలపరీక్ష కోసం గవర్నర్ కోరడం అన్యాయమని ఆరోపించింది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో శివసేన వేసిన పిటిషన్ విచారణకు న్యాయస్థానం అనుమతించింది.

" మహారాష్ట్ర గవర్నర్ బలపరీక్ష చేయాలని కోరడంపై మేం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మేం చేసిన అభ్యర్థన సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో బలపరీక్ష కోరడం అన్యాయం. దీని కోసమే గవర్నర్ ఎదురుచూశారు.                                         "
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ 

గోవాకు

మరోవైపు శివసేన రెబల్ ఎమ్మెల్యులు బుధవారం గోవా చేరనున్నట్లు సమాచారం. వీరి కోసం తాజ్ రిసార్ట్‌లో 70 గదులను బుక్ చేశారు. అనంతరం గురువారం వీరంతా ముంబయి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

భాజపా కూడా తమ ఎమ్మెల్యేలంతా బుధవారం సాయంత్రం ముంబయి తాజ్‌ హోటల్‌కు రావాలని ఆదేశించింది.

Also Read: mohammed zubair Remand : జర్నలిస్ట్ జుబేర్‌కు 4 రోజుల పోలీస్ కస్టడీ - అరెస్ట్‌ను ఖండించిన విపక్షాలు !

Maharashtra Political Crisis: 'ప్లీజ్ వచ్చేయండి, మీ అన్నగా చెబుతున్నా'- రెబల్ ఎమ్మెల్యేలకు ఠాక్రే ఎమోషనల్ లెటర్

టాప్ హెడ్ లైన్స్

AIADMK Crisis EPS 2026: AIADMK సంక్షోభం - ఈపీఎస్ కోట బద్దలు కొడుతున్న వలసలు - వాడిపోతున్న రెండాకులు - భవిష్యత్ లేదా?
సంక్షోభం - ఈపీఎస్ కోట బద్దలు కొడుతున్న వలసలు - వాడిపోతున్న రెండాకులు - భవిష్యత్ లేదా?
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
DK Shivakumar: కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
Breaking News: ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Embed widget