అన్వేషించండి

Man brutally thrashed: కదులుతున్న కారులో కాళ్లు నాకమని చిత్రహింసలు- మధ్యప్రదేశ్‌లో మరో దారుణం

మధ్యప్రదేశ్‌లో వరుస అమానవీయ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఆదివాసిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన మరువక ముందే మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది.

Man brutally thrashed:  మధ్యప్రదేశ్‌లో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది. యువకుడిని తన కాళ్లు నొక్కాలని ఓ వ్యక్తి చితకబాదాడు. అంతటితో ఆగకుండా తన కాళ్లు నాకాలంటూ చిత్రహింసలు చేసి చివరికి యువకుడితో కాళ్లు నాకించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని కొంత మంది యువకులు కారులో వెళ్లి కిడ్నాప్ చేశారు. కారులో ఎక్కించుకున్న యువకుడిని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కదులుతున్న కారులోనే అతనిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ యువకుడి ముఖంపై చెప్పులతో కొట్టారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, పిడిగుద్దులతో యువకుడిని చిత్రహింసలు పెట్టారు. ఆపై ఆ యువకుడితో తమ కాళ్లు నాకించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలను ఆ కారులోనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

పోలీసుల కంటపడ్డ వీడియో...

యువకుడి పట్ల దాష్టీకం ప్రదర్శించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన జూన్ 30వ తేదీన జరిగగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, నిందితులు అందరూ గ్వాలియర్ జిల్లాలోని దబ్రా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటన తర్వాత బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దర్ని అరెస్ట్ చేశామని..పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టినట్లు వివరించారు. అయితే సంబంధిత యువకుడిపై నిందితులు ఎందుకు దాడి చేశారన్నది మాత్రం పోలీసులు వెల్లడించక పోవడం గమనార్హం.

ఇటీవల మూత్రవిసర్జన కలకలం...

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఇటీవల ఓ ఆదివాసిపై బీజేపీ నేత అనుచరుడు మూత్ర విసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా.. నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసి.. ఇంటిని కూల్చి వేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌.. బాధితుడిని తన నివాసానికి ఆహ్వానించారు. జరిగిన ఘటనకు సీఎం ఆ ఆదివాసీ యువకుడికి క్షమాపణలు చెప్పారు. అంతటితో ఆగకుండా ఆదివాసీ యువకుడి కాళ్లు కడిగి ఆ నీటిని తలపై చల్లుకున్నారు. ఈ ఘటన మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Embed widget