అన్వేషించండి

అలాంటి కంటెంట్‌ని లైక్‌ చేయడంలో తప్పేమీ లేదు, హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Allahabad High Court: సోషల్ మీడియాలో అభ్యంతకరమైన పోస్ట్‌లను లైక్ చేయడాన్ని నేరంగా భావించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

Allahabad High Court:

అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు..

అలహాబాద్‌ హైకోర్టు ( Allahabad High Court) సోషల్ మీడియా పోస్ట్‌లపై కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లను లైక్‌ చేయడం నేరం కాదని, కానీ వాటిని షేర్ చేయడం లేదా రీ పోస్ట్ చేయడం మాత్రం నేరంగానే పరిగణించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. అలాంటి పోస్ట్‌లు పెడితే Information Technology (IT) Act సెక్షన్ 67 ప్రకారం అభ్యంతరకరమైన కంటెంట్‌ని అందరికీ సర్క్యులేట్ చేసినట్టే అవుతుందని స్పష్టం చేసింది. దీన్ని కచ్చితంగా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అభ్యంతరకరమైన పోస్ట్‌కి లైక్‌ కొట్టినందుకు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్...ఆ వ్యక్తి చేసింది నేరంగా పరిగణించాలన్న వాదనను కొట్టి పారేశారు. ఆ పిటిషన్‌ని తిరస్కరించారు. 

"ఆ వ్యక్తి పోస్ట్ చేసిన కంటెంట్‌ అభ్యంతరకరంగా ఏమీ అనిపించలేదు. ఫేస్‌బుక్‌లో కానీ వాట్సాప్‌లో కానీ ఎలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ కనిపించలేదు. అలాంటప్పుడు నేరంగా పరిగణించలేం. ఎలాంటి చర్యలు తీసుకోలేం. ప్రస్తుత కేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఓ అభ్యంతకరమైన పోస్ట్‌కి లైక్ మాత్రమే కొట్టాడు. కానీ దాన్ని రీపోస్ట్ చేయలేదు. పోస్ట్‌ లైక్ చేసినంత మాత్రాన నేరంగా పరిగణించలేం. ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద ఈ కేసుని చేర్చలేం"

- అలహాబాద్ హైకోర్టు


సప్తపది వేడుక, ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లుబాటు కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తన నుంచి విడిపోయిన భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే రెండవ వివాహం చేసుకుందని ఆరోపించిన ఒక వ్యక్తి పిటిషన్‌ను తిరష్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తాను రెండో పెళ్లి చేసుకున్నట్టు ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టులో వేసిన పిటీషన్‌ను భార్య అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్.. ‘వివాహానికి సంబంధించి సరైన వేడుకలు, సరైన ఆచారాలతో వివాహాన్ని జరుపుకోవడం అని అర్థం. సంప్రదాయాలు, ఆచారాలను పాటించి వివాహం జరుపుకోకపోతే లేదా నిర్వహించకపోతే అది పెళ్లి అని చెప్పలేం’ అని వ్యాఖ్యానించారు. వివాహానికి సంబంధించి ఖచ్చితంగా చేయాల్సిన క్రతువుల్లో సప్తపది ఒకటని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, సాంప్రదాయాలు లేకుండా వివాహం జరిగితే అది శాస్త్రీయంగా జరిగిందని భావించలేమని చట్టం దృష్టిలో అది వివాహం కాదన్నారు. వివాహం చెల్లుబాటు అయ్యే వివాహం కాకపోతే, పార్టీలకు వర్తించే చట్టం ప్రకారం, చట్టం దృష్టిలో అది వివాహం కాదని అభిప్రాయపడింది. హిందూ చట్టం ప్రకారం పెళ్లిలో 'సప్తపది' క‌ృతువు పెళ్లి చెల్లుబాటు అయ్యే వాటిలో ఒకటి అని పేర్కొంది. అయితే ప్రస్తుత కేసులో పేర్కొన్న సాక్ష్యాలు లేవని కోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ మేరకు.. ఇది హిందూ వివాహాన్ని వారి సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా జరుపుకోవచ్చని పేర్కొంది. 

Also Read: పాలస్తీనా వ్యవహారంలో భారత్‌ కన్‌ఫ్యూజ్ అవుతోంది - శరద్ పవార్ చురకలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget