లేదు, ఒంటరిగా డ్రైవ్ చేయడం నిషేధం. మీరు వాహనం నడుపుతున్నప్పుడు పూర్తి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి తప్పనిసరిగా మీ పక్కన ఉండాలి.
Driving Licence Rules: లెర్నింగ్ లైసెన్స్‌తో వాహనం నడుపుతున్నారా? రూ.5,000 ఫైన్, ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి!
Driving Licence Rules: లెర్నర్ లైసెన్స్ రాగానే ఒంటరిగా రోడ్డుపైకి వెహికల్ తో వెళ్తే.. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ రూల్స్ ఏంటో చూద్దాం.

- లెర్నర్ లైసెన్స్‌తో ఒంటరి డ్రైవింగ్ నిషిద్ధం, పూర్తి లైసెన్స్ వ్యక్తి అవసరం.
- వాహనం ముందు, వెనుక 'L' గుర్తు తప్పనిసరిగా ప్రదర్శించాలి.
- నిబంధనలు ఉల్లంఘిస్తే ₹5,000 వరకు జరిమానా, జైలు శిక్ష విధించవచ్చు.
- ప్రమాదానికి గురైతే బీమా క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది.
Driving Licence Rules: డ్రైవింగ్ నేర్చుకునే ఉత్సాహంలో చాలామంది లెర్నింగ్ లైసెన్స్ చేతికి రాగానే వెహికల్‌తో రోడ్డుపైకి ఒంటరిగా వచ్చేస్తుంటారు. అయితే, సరైన రూల్స్ తెలియకుండా ఇలా చేయడం మీ జేబుకు చెల్లు చేయడమే కాకుండా చట్టపరమైన చిక్కులు తప్పవు. లెర్నింగ్ లైసెన్స్ ఉన్నవారు రోడ్డుపై వెహికల్ నడిపేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు, వాటిని ఉల్లంఘిస్తే పడే జరిమానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒంటరిగా డ్రైవింగ్ చేయడం నిషేదం
మీరు కొత్తగా లెర్నింగ్ లైసెన్స్ పొందినంత మాత్రాన మీరు ఒంటరిగా వెహికల్ నడపడానికి అర్హులు కారు. చట్టం ప్రకారం మీరు వాహనం నడుపుతున్నప్పుడు మీ పక్కన పూర్తి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే పక్కన ఉన్న డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయడానికే సహాయపడతారు.
2. 'L' గుర్తు తప్పనిసరి
లెర్నింగ్ లైసెన్స్‌తో వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తమ వెహికల్‌పై ముందు, వెనుక భాగాల్లో స్పష్టంగా కనిపించేలా ఎరుపు రంగు 'L' సింబర్ ఏర్పాటు చేయాలి. దీనివలన వెనుక, ముందు నుంచి వచ్చే ఇతర వాహనదారులు మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారని గ్రహించి, తగినంత దూరం పాటిస్తూ జాగ్రత్తగా వెళ్తారు. ఈ 'L' బోర్డు లేకపోవడం కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది.
3. ఉల్లంఘిస్తే ఎంత చలాన్ ?
సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా లెర్నర్స్ లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించి ఒంటరిగా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 3/181 ప్రకారం రూ.5,000 వరకు భారీ జరిమానా విధించవచ్చు. అధిక ఉల్లంఘన జరిగితే జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
4. ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా?
లెర్నింగ్ లైసెన్స్‌పై ఒంటరిగా డ్రైవింగ్ చేస్తూ ఏదైనా ప్రమాదానికి గురైతే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు నిబంధనల ఉల్లంఘనను కారణముగా చూపి మీ క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ పాలసీ షరతుల ప్రకారం క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
డ్రైవింగ్ నేర్చుకోవడం మంచిదే, కానీ చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం. పూర్తిస్థాయి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేవరకు అనుభవజ్ఞుడైన డ్రైవర్ పక్కన పెట్టుకుని, 'L' గుర్తుతో మాత్రమే వాహనం నడపండి.
Also Read: దీపావళి వరకు నిరసనలపై నిషేధం.. ప్రధానికి దిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
Frequently Asked Questions
లెర్నింగ్ లైసెన్స్ ఉన్నవారు ఒంటరిగా డ్రైవ్ చేయవచ్చా?
లెర్నింగ్ లైసెన్స్‌తో వాహనం నడిపేటప్పుడు 'L' గుర్తు తప్పనిసరా?
అవును, వాహనం ముందు, వెనుక భాగాల్లో స్పష్టంగా కనిపించేలా ఎరుపు రంగు 'L' గుర్తు ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఇది ఇతరులకు మీరు నేర్చుకుంటున్నారని సూచిస్తుంది.
లెర్నింగ్ లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ఎంత?
లెర్నర్స్ లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తే, మోటార్ వాహనాల చట్టం ప్రకారం రూ.5,000 వరకు జరిమానా విధించవచ్చు. తీవ్రమైన ఉల్లంఘనలకు జైలు శిక్ష కూడా పడవచ్చు.
లెర్నింగ్ లైసెన్స్‌తో ఒంటరిగా డ్రైవ్ చేస్తూ ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా?
లేదు, క్లెయిమ్ చేసుకోవడం కష్టం. ఇన్సూరెన్స్ కంపెనీలు నిబంధనల ఉల్లంఘనను కారణం చూపి మీ క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు






















