సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నానమ్మ సావిత్రిబాయి శంకర్ దీప్కే (85 ఏళ్లు) కన్నుమూశారు. ఆమె వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
CJP founder Abhijit Dipke | సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీలో నిరసనలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో తీరని విషాదం చోటుచేసుకుంది. దీప్కే నానమ్మ కన్నుమూశారు.

- సీజేపీ అధినేత నానమ్మ మృతి, దీప్కే నిర్బంధం.
- ఓటర్ల ప్రక్రియ నిరసనకు దీప్కే విమానంలోనే అదుపులోకి.
- అరెస్టుతో ఉద్యమ పగ్గాలు అజింక్య షిండేకు బదిలీ.
Cockroach Janta Party (CJP) | విజయవాడ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట్లో తీరని విషాదం నెలకొంది. సీజేపీ వ్యవస్థాపకుడు దీస్కే నానమ్మ సావిత్రిబాయి శంకర్ దీప్కే (85 ఏళ్లు) కన్నుమూశారు. అక్టోబర్ 10న మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలో ఆమె తుదిశ్వాస విడిచారని పార్టీ నేతలు తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కొంతకాలం నుంచి చికిత్స పొందుతున్నారు. సర్ ఓటర్ల ప్రక్రియ విధానాన్ని వ్యతిరేకిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ లో నిరసనకు సీజేపీ పిలుపునిచ్చింది.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనేందుకు వెళ్లిన అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసులు ఎందుకు వచ్చారు, మగ పోలీసులు ఎందుకు రాలేదని దీప్కే ప్రశ్నించారు. విమానం దిగే వరకు ఆగలేకపోయారా.. మా మీద ఏ కేసులు పెట్టి వేధిస్తారో చేసుకోండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నిరసనలో పాల్గొనేందుకు అభిజిత్ దీప్కే ఢిల్లీకి వెళ్లగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న సమయంలోనే స్వగ్రామంలో నానమ్మ సావిత్రిబాయి శంకర్ దీప్కే కన్నుమూశారు. దీప్కే పోలీసుల అదుపులో ఉండగానే ఇటు నానమ్మ మరణవార్త సీజేపీ అధినేతను ఆవేదనకు గురిచేసింది.
మరోవైపు అభిజిత్ దీప్కే తల్లిదండ్రులు స్వగ్రామానికి చేరుకుని సావిత్రిభాయి దీప్కే అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నానమ్మ అంత్యక్రియలకు అభిజిత్ దీప్కే హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అభిజీత్ దీప్కే అరెస్ట్.. CJP ఉద్యమ పగ్గాలు అజింక్య షిండేకు!
ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) ద్వారా ఓట్ల తొలగింపుతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసనకు సిద్ధమైన Cockroach Janta Party నేతలను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. దీప్కేతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రహస్య ప్రదేశానికి తరలించారని సీజేపీ నేతలు చెబుతున్నారు.
ఉద్యమానికి కొత్త నాయకుడు
CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేడు ఏం జరగనుందో ముందే ఊహించారు. అందుకే ముందుగానే రికార్డ్ చేసిన వీడియోలో తాను, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కనుక అరెస్టయితే ఉద్యమ బాధ్యతలను అజింక్య షిండే చేపడతారని స్పష్టం చేశారు. అభిజిత్ దీప్కే నిర్బంధం తర్వాత ఆ వీడియో పార్టీ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయింది. సీజేపీ నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌చార్జ్ అజింక్య షిండే నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, మరోవైపు సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు వ్యతిరేకిస్తూ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
Frequently Asked Questions
అభిజిత్ దీప్కే కుటుంబంలో కన్నుమూసినవారు ఎవరు?
అభిజిత్ దీప్కేను ఎందుకు అరెస్టు చేశారు?
సర్ ఓటర్ల ప్రక్రియ విధానాన్ని వ్యతిరేకిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
ప్రస్తుతం సీజేపీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?
అభిజిత్ దీప్కే అరెస్టు తర్వాత, అజింక్య షిండే సీజేపీ నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్‌గా జంతర్ మంతర్ వద్ద నిరసనను కొనసాగిస్తున్నారు.
సీజేపీ నిరసనల ప్రధాన డిమాండ్ ఏమిటి?
సర్ ఓటర్ల ప్రక్రియ విధానాన్ని వ్యతిరేకిస్తూ, అందులో జరిగిన అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























