అన్వేషించండి

Teachers Day 2024: సర్వేపల్లి రాధాకృష్ణన్ తండ్రి తీసుకున్న సరైన నిర్ణయమే ఆయనను రాష్ట్రపతిని చేసిందా!

Teachers Day 2024 History : రాధాకృష్ణన్‌ తండ్రికి పై ఆయన పై చదువులు చదవడం ఇష్టం లేదు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు తన కొడుకు కూడా ఏదో ఒక దేవాలయంలో పూజారిగా స్థిరపడాలని కోరుకున్నారు.

Happy Teachers Day 2024 : మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజనీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా పదవులకే వన్నెతెచ్చిన ‘భారతరత్నం’. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంలో, విద్యకు సమాజంలో సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన ప్రజ్ఞ, చొరవ తనను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. అందుకే ఆయన పుట్టినరోజును స్మరించుకుంటూ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రముఖ పండితుడు, ఉపాధ్యాయుడు. రాజకీయ నాయకుడు, ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు గ్రహీత కూడా. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5, 1962 న జరుపుకున్నారు. అలాగే, రాష్ట్రపతి రాధాకృష్ణన్ అదే సంవత్సరంలో అధికారం చేపట్టారు. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి అయ్యారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన తర్వాత రెండవ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు. 1965లో ఆయన విద్యార్థులు, స్నేహితులు తన పుట్టినరోజును నిర్వహించడానికి సంప్రదించారు.  ఆ సమయంలోనే తన జన్మదిన వేడుకలు కాకుండా ఉపాధ్యాయులందరినీ గౌరవించేలా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు.
 
స్కాలర్ షిప్ ల మీదే చదువు పూర్తి
రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులు. రాధాకృష్ణన్ తొలినాళ్లు తిరుత్తణి, తిరుపతిలోనే గడిచాయి. తండ్రి స్థానిక జమిందార్ వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కేవీ హైస్కూల్లో జరిగింది. 1896లో తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్ ఎవాంజిలికల్ లూథరన్ మిషన్ స్కూలులోనూ, వాలాజీపేటలోని ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్లో జరిగింది.  మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఫిలాసఫీ చదివారు. ఆయన చదువంతా స్కాలర్‌షిప్‌ల‌తోనే జరిగింది.  

పదహారేళ్ల వయసులోనే పెద్దలు కుదిర్చిన తన దూరపు బంధువైన శివకామును వివాహం చేసుకున్నారు. వీరికి గోపాల్ అనే కుమారుడితో పాటు ఐదుగురు కుమార్తెలు కలిగారు. తరువాత మైసూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయంతో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆయన విశేష కృషి కారణంగా ఆంధ్రా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. అతను తన జీవితకాలంలో అనేక అవార్డులు అందుకున్నారు.  

పూజారిని చేద్దామనుకున్న తండ్రి, కానీ రాష్ట్రపతి స్థాయికి..
నిజానికి రాధాకృష్ణన్‌ తండ్రి వీరాస్వామికి పై ఆయన పై చదువులు చదవడం ఇష్టం ఉండేది కాదు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడంతో తన కొడుకు కూడా ఏదో ఒక దేవాలయంలో పూజారిగా స్థిరపడాలని ఆయన తండ్రి కోరుకున్నారు. అయితే.. తన కుమారుడి అద్భుత ప్రతిభను చూసి ఎంత కష్టమైన పడి తనను పై చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత మనందరికీ తెలిసిన సంగతే.. విద్యావేత్తగా, దార్శనికుడిగా, రాజకీయ నాయకుడిగా విజయవంతమైన ప్రయాణం సాగించి.. చరిత్ర పుటల్లో నిలిచారు. ఆ రోజు రాధాకృష్ణన్ తండ్రి మనసు మార్చుకోకపోతే, ఈ మహానుభావుడు, గొప్ప విద్యావేత్త, దార్శనికుడు, భారతదేశ రాష్ట్రపతిగా మనం చూసేవాళ్ళం కాదేమో.

Also Read: Teachers Self Care Secrets : టీచర్స్​ డే స్పెషల్.. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి టీచర్స్ ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget