అన్వేషించండి

పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన కేరళ, ఆల్‌పార్టీ మీటింగ్‌కి పిలుపునిచ్చిన సీఎం

Kalamassery Blast: పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం ఆల్‌పార్టీ మీటింగ్‌కి పిలుపునిచ్చింది.

Kochi Blast:

ఆల్‌పార్టీ మీటింగ్..

పేలుళ్ల ఘటనతో ఒక్కసారిగా కేరళ ప్రభుత్వం (kerala blast news) అప్రమత్తమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఉగ్రదాడుల అనుమానాల నేపథ్యంలో NSG టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకోనుంది. NIA దర్యాప్తునకూ ఆదేశించింది. ఈ క్రమంలోనే సీఎం పినరయి విజయన్ ఆల్ పార్టీ మీటింగ్‌కి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఈ ఘటన (Kochi Blast News) జరిగిన వెంటనే కేరళకు బయల్దేరారు. సోమవారం (అక్టోబర్ 30) ఉదయం 10 గంటలకు సమావేశమవ్వాలని నిర్ణయించారు. సెక్రటేరియట్‌లోని సీఎం కాన్ఫరెన్స్‌ హాల్‌లో భేటీకి పిలుపునిచ్చినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.  9.47 నిముషాలకు మొదటి పేలుడు సంభవించింది. టిఫిన్‌ బాక్స్‌లో IED పెట్టి పేల్చినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టింది. 

ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారంటే..? ఈ పేలుళ్లలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం 40 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రత పరంగా చూస్తే తక్కువగానే అనిపించినప్పటికీ...వరుసగా ఒకే చోట మూడు పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. ఎర్నాకులంలోని కలమస్సెరీ కన్వెన్షన్ హాల్‌లో ఈ పేలుళ్లు (Kalamassery Blast) సంభవించాయి. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనను తలుచుకుని ఆందోళనకు లోనవుతున్నారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించిందని, అంతలోనే మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. పేలుడు ధాటికి హాల్ అంతా పొగ కమ్ముకుందని వివరించారు.

"సరిగ్గా హాల్‌ మధ్యలోనే పేలుడు సంభవించింది. మూడు సార్లు గట్టిగా శబ్దాలు వినిపించాయి. నేను వెనకాల ఉన్నాను కాబట్టి నాకేమీ కాలేదు. కానీ విపరీతంగా పొగ కమ్ముకుంది. ఓ మహిళ చనిపోయిందని అందరూ అనుకుంటుంటే విన్నాను. ఈ హాల్‌కి మొత్తం 6 ఎంట్రీ, ఎగ్జిట్ గేట్‌లున్నాయి. పేలుడు శబ్దం వినిపించిన వెంటనే అందరూ ఎవరి దారిలో వాళ్లు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశారు. మంటలు పూర్తిగా వ్యాపించకపోవడం వల్ల ప్రమాదం తప్పింది"

- ప్రత్యక్ష సాక్షి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget