By: Ram Manohar | Updated at : 13 Sep 2023 05:41 PM (IST)
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు ఆపి పిల్లలకు అమ్మ చేతి వంట రుచి చూపించాలని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది.
Kerala High Court:
కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఓ కేసు విచారణలో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు అమ్మ చేతి వంటే తినిపించాలని, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు చేసుకునే అలవాటు మానుకోవాలని సూచించింది. పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసు విచారణలో ఈ సూచనలు చేసింది. తల్లిదండ్రులు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్లు పెట్టడం ఆపేసి పిల్లలకు తమ చేతి వంట రుచి చూపించాలని చెప్పింది. రోడ్డు పక్కనే ఓ వ్యక్తి అసభ్యకర వీడియోలు చూస్తుండగా పోలీసులు అతడిని గమనించి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అలాంటి వీడియోలు ప్రైవేట్‌గా చూస్తే తప్పేం కాదని తేల్చి చెప్పింది. ఇదే క్రమంలో పిల్లలకు మొబైల్ ఫోన్స్ అలవాటు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాళ్లు బయట ఆడుకునేలా చూడాలని, అమ్మ చేతి కమ్మనైన వంట రుచి చూసేలా అలవాటు చేయాలని తెలిపింది. జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్లు పెట్టుకుని ఆ రెస్టారెంట్ ఫుడ్ కొనుక్కోవడం మానేయండి. చక్కగా పిల్లలు అమ్మచేతి వంటను ఆస్వాదించే అవకాశం ఇవ్వండి. వాళ్లకు నచ్చినవి చేసి పెట్టండి. వాళ్లు ఇంట్లోనే కూర్చోకుండా బయటకు వెళ్లి ఆడుకునేలా ప్రోత్సహించండి. అలా ఆడుకుని అలిసిపోయి ఇంటికి రాగానే అమ్మ చేతి వంట కమ్మనైన పరిమళాన్ని వాళ్లను ఆస్వాదించనివ్వండి. పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇచ్చే విషయంలోనూ జాగ్రత్తలు పాటించండి. మైనర్‌లకు ఫోన్‌లు దూరంగా ఉంచండి"
- జస్టిస్ పీవీ కున్హి కృష్ణన్, కేరళ హైకోర్టు
ఫోర్న్ వీడియోలు, ఫొటోలు చూడటం అసభ్యకరం.. అదో నేరం. అందరూ ఇదే అభిప్రాయపడుతున్నారు. కానీ కేరళ కోర్టు మాత్రం ఇలాంటి కేసులో కీలక తీర్పు ఇచ్చింది. అశ్లీల ఫోటోలు, వీడియోలను ఇతరులకు చూపించకుండా... ఒంటరిగా చూడటం చట్టం ప్రకారం నేరం కాదని పేర్కొంది. అది ప్రతి వ్యక్తి వ్యక్తిగత ఎంపిక అని చెప్పింది కేరళ హైకోర్టు. అది నేరం అని చెప్పడం సరికాదని... ఒక వ్యక్తి గోప్యతలోకి చొరబడి.. అతని వ్యక్తిగత ప్రాధాన్యతల్లో జోక్యం చేసుకోవడమే అని చెప్పింది ధర్మాసనం. 33ఏళ్ల తరుణ్‌పై నమోదైన కేసును రద్దు చేసింది కేరళ హైకోర్టు. అశ్లీల వీడియోలు, ఫొటోలను బహిరంగంగా ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, పంపించడం నేరమని తెలిపింది. ఫోర్న్ వీడియోలు, ఫొటోలను ఒంటరిగా చూడటం తప్పుకాదని... ఏ కోర్టు దానిని నేరంగా పరిగణించదని తెలిపింది కోర్టు. నిందితుడు ఈ వీడియోను బహిరంగంగా ఎవరికీ చూపించినట్లు ఎలాంటి ఆరోపణ లేవని ధర్మాసనం పేర్కొంది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమయంలో అశ్లీల ఫోటోలు, వీడియోలను చూడటం IPC సెక్షన్ 292 ప్రకారం నేరం కాదని.. తెలిపింది. ఏదైనా అసభ్యకరమైన వీడియో కానీ ఫొటో కానీ బహిరంగంగా ప్రదర్శించడం.. షేర్ చేయడం వంటివి చేస్తేనే సెక్షన్ 292 ప్రకారం నేరం అవుతుందని తెలిపింది కేరళ హైకోర్టు.
Also Read: మా ఫుల్ సపోర్ట్ మీకే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సమర్థించిన కిమ్ - పుతిన్‌తో స్పెషల్ మీటింగ్
Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Law Commission: లైంగిక కార్యకలాపాల సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించవద్దు, కేంద్రానికి లా కమిషన్ నివేదిక
Bank CEO Quits: క్యాబ్ డ్రైవర్ అకౌంట్‌లోకి 9వేల కోట్లు - ఆ బ్యాంకు సీఈవో రాజీనామా!
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>