Kerala High Court: బాలికను గర్భవతిని చేసిన సోదరుడు - కేరళ హైకోర్టు సంచలన తీర్పు
Kerala High Court: కేరళలో సొంత సోదరిని గర్భవతిని చేశాడు ఓ వ్యక్తి. ఈ కేసులో 7 నెలల గర్భం తొలగించేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Kerala High Court: కామం కళ్లు మూసుకుపోయేలా చేస్తుంది. వావివరసలను మర్చిపోయేలా చేస్తుంది. రక్షణగా నిలవాల్సిన వారిని భక్షకులుగా మారుస్తుంది. భద్రంగా చూసుకోవాల్సిన వారితో బజారున పడేయిస్తుంది. తండ్రులు కూతుళ్లపై, అన్నలు చెల్లెల్లపై, మామల కోడళ్లపై అఘాయిత్యాలు చేస్తున్న ఘటనలో తరచూ ఎక్కడో ఒక దగ్గర వెలుగులోకి వస్తూ.. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా.. సొంత నాన్న, అన్న, తమ్ముళ్ల నుండి రక్షణ లభిస్తుందని ధైర్యంగా ఉండాల్సిన రోజులు పోయాయి. ఎప్పుడు ఎవరూ మీద పడిపోతారో చెప్పలేని దౌర్భాగ్యం దాపురించింది. ఇలాంటి ఓ దారుణ ఘటన తాజాగా కేరళలో వెలుగు చూసింది.
సామాజిక, వైద్యపరమైన సమస్యలు వస్తాయని అనుమతి
తోడ బుట్టిన సోదురుడే 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసి గర్భవతిని చేశాడు. ఈ కేసులో ప్రస్తుతం ఆ బాలిక 7 నెలల గర్భాన్ని మోస్తుంది. ఈ గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ బాలిక, తల్లిదండ్రులు కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. విచారించిన ధర్మాసనం 7 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మెడికల్ బోర్డు సమర్పించిన రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జియాద్ రెహమాన్ ఏఏ, గర్భం తొలగింపునకు అనుమతి ఇవ్వకపోతే వివిధ సామాజిక, వైద్య పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి ఆ గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
'గర్భం తొలగించడానికి అనుమతించడం అనివార్యం'
కేరళలో ఒకే తల్లి కడుపున పుట్టిన సోదరుడి వల్ల 15 ఏళ్ల బాలిక గర్భవతి అయింది. ప్రస్తుతం ఆ బాలిక 7 నెలల గర్భాన్ని మోస్తుంది. తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ బాలిక, కుటుంబసబ్యులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తన మైనర్ కూతురి గర్భాన్ని తొలగించాలని ఆమె తండ్రి కోర్టును కోరాడు. బాలిక గర్భాన్ని తొలగించడానికి అనుమతి ఇవ్వకపోతే సామాజిక, వైద్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తూ.. గర్భాన్ని తొలగించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. జస్టిస్ జియాద్ రెహ్మాన్ తో కూడిన సింగిల్ బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత ఆ పిండం శారీరకంగా ఫిట్ గా ఉన్నట్లు స్పష్టమవుతోందని, గర్భం కొనసాగడం వల్ల శిశువు సామాజిక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది.
సొంత తోబుట్టువు కారణంగా వచ్చిన గర్భాన్ని తొలగించడానికి పిటిషన్ కోరిన అనుమతి అనివార్యమని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. బాలిక గర్భాన్ని ఆలస్యం చేయకుండా వైద్యపరంగా తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నామని మే 19వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది కేరళ హైకోర్టు. తదుపరి తేదీన, గర్భం తొలగింపు ప్రక్రియ పూర్తయినట్లు సంబంధించిన నివేదికను కోర్టు ముందు ఉంచాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఈ కేసులో తలెత్తే మరిన్ని సమస్యలను పరిష్కరించడానికి తగిన ఉత్తర్వులు జారీ చేయడానిక వీలుగా నివేదికను కోర్టు ముందు సమర్పించాలని తన ఉత్తర్వులో స్పష్టం చేసింది కేరళ హైకోర్టు.