News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Jammu and Kashmir: కశ్మీరీ పండిట్ దారుణ హత్య- కాల్చి చంపిన ఉగ్రవాదులు!

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

FOLLOW US: 
Share:

Jammu and Kashmir: 

జమ్ముకశ్మీరులోని ఓ కశ్మీరీ పండిట్‌ను అనుమానిత ఉగ్రవాదులు గురువారం కాల్చి చంపారు. బుద్గాం జిల్లాలోని చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ అనే వ్యక్తి గుమస్తాగా పని చేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాహుల్‌.. ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు.

ఇదీ జరిగింది

ప్రధాన మంత్రి ప్యాకేజి పథకంలో భాగంగా చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ గుమస్తాగా పని చేస్తున్నాడు. ఆయనపై గురువారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను బుద్గాంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను శ్రీనగర్‌లోని మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.

పోలీసులు అలర్ట్

ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు జమ్ముకశ్మీరు పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు.

" బుద్గాం జిల్లాలో రాహుల్ భట్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనను ఖండిస్తున్నాను. ఈ ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తులు శిక్ష నుంచి తప్పించుకోలేరు. మృతుడి కుటుంబానికి జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అండగా ఉంటుంది.                                                      "
-మనోజ్ సిన్హా జమ్ముకశమీర్ లెఫ్టినెంట్ గవర్నర్

Also Read: Sedition Law: రాజద్రోహం చట్టం గురించి తెలుసా? అభియోగాలు మోపిన కేసుల్లో నిరూపణ అయినవి ఇంతేనా!

Also Read: New Chief Election Commissioner: కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్- మే 15 నుంచి బాధ్యతల స్వీకరణ

Published at : 12 May 2022 10:45 PM (IST) Tags: Jammu Kashmir Kashmiri Pandit Kashmiri Pandit killed Kashmiri Pandit killed by terrorists

ఇవి కూడా చూడండి

One Nation One Election: నేడు లా కమిషన్ కీలక భేటీ! వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌ సాధ్యం అవుతుందా?

One Nation One Election: నేడు లా కమిషన్ కీలక భేటీ! వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌ సాధ్యం అవుతుందా?

Chandrayaan 3: ఉలుకు పలుకు లేని చంద్రయాన్ ల్యాండర్, రోవర్ - సన్నగిల్లుతున్న ఇస్రో ఆశలు!

Chandrayaan 3: ఉలుకు పలుకు లేని చంద్రయాన్ ల్యాండర్, రోవర్ - సన్నగిల్లుతున్న ఇస్రో ఆశలు!

Gold-Silver Price 27 September 2023: గుడ్‌న్యూస్‌ చెప్పిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 27 September 2023: గుడ్‌న్యూస్‌ చెప్పిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

టాప్ స్టోరీస్

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?

Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?