Karnataka News: భూగర్భంలో ట్రాన్స్ ఫార్మర్ - సరికొత్త వ్యవస్థను ప్రారంభించిన కర్ణాటక ప్రభుత్వం
Karnataka News: కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు మల్లేశ్వరంలో.. దేశంలోనే తొలి సారిగా భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రారంభించింది.
![Karnataka News: భూగర్భంలో ట్రాన్స్ ఫార్మర్ - సరికొత్త వ్యవస్థను ప్రారంభించిన కర్ణాటక ప్రభుత్వం Karnataka India First Underground Power Transformer Station in Bengaluru Malleswaram BESCOM Know More Details Karnataka News: భూగర్భంలో ట్రాన్స్ ఫార్మర్ - సరికొత్త వ్యవస్థను ప్రారంభించిన కర్ణాటక ప్రభుత్వం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/06/06c7993fa4e45fb580152da12b3a07391693993589296519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karnataka News: కర్ణాటక ప్రభుత్వం భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రారంభించింది. దేశంలోనే ఇది తొలిది కావడం గమనార్హం. బెంగళూరు మల్లేశ్వరంలో విద్యుత్తు శాఖ మంత్రి కేజే జార్జి మంగళవారం రోజు భూగర్భ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు. అయితే ఈ కేంద్రం శక్తి 500 కిలో వాట్లు అని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగానే జార్జి మాట్లాడుతూ.. బెంగళూరు నగరంలో ఉపరితల విద్యుత్తు తీగలను తొలగించి భూగర్భంలో అమర్చుతున్నామని తెలిపారు. ఈ ప్రక్రియను ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.
భూగర్భ విద్యుత్తు కేబుల్, ట్రాన్స్‌ఫార్మర్ వ్యవస్థ చాలా సురక్షితమని, విద్యుత్తు సరఫరాలో ఎలాంటి తేడా రాదని ఆయన వివరించారు. రూ.1.97 కోట్లతో మల్లేశ్వరం కేంద్రాన్ని నిర్మించామని పేర్కొన్నారు. సివిల్ పనులకే 68 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని వ్యాఖ్యానించారు. భూగర్భంలోనే 14 మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వైడల్పు, ఐదు మీటర్ల లోతున విద్యుత్తు నియంత్రిక అమర్చామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ అశ్వత్థ్ నారాయణ, ఇంధన వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా, బెస్కాం ఎండీ మహంతేశ్ బిళగి, పాలికె చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Read Also: Nitish Kumar: హోం మంత్రికి కాల్ చేయండీ, సొంత శాఖనే మర్చిపోయిన నితీష్ కుమార్- సోషల్ మీడియాలో వైరల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)