అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nitish Kumar: చంద్రబాబును ఇరుకున పెడుతున్న నితీశ్ - పదే పదే కేంద్రం ముందు ప్రత్యేక హోదా డిమాండ్, ఏం జరుగుతుందో?

Bihar CM Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ మేరకు తీర్మానానికి ఆ పార్టీ సమావేశంలో శనివారం ఆమోదం తెలిపారు.

JDU Seeks Special Category Status For Bihar: కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) తాజాగా కేంద్రానికి గట్టి మెలిక పెట్టారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ కార్యవర్గ సమావేశంలో శనివారం తీర్మానించారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ (Special Status) లేదా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆ పార్టీ ఆమోదించింది. అలాగే, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో అక్రమాలు నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక, కఠిన చట్టం చేయాలని తీర్మానించింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లను నితీశ్ కుమార్ మోదీ సర్కారు ముందు ఉంచుతున్నారు. అయితే, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని గతంలోనే కేంద్ర పెద్దలు స్ఫష్టం చేసిన క్రమంలో.. మళ్లీ నితీశ్ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంలో కీలకంగా ఉన్న ఆయన డిమాండ్‌పై ఇప్పుడు మోదీ సర్కారు ఎలా స్పందిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.

మూడో అతి పెద్ద పార్టీగా..

బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఆ రాష్ట్ర కేబినెట్ గతేడాది ఓ తీర్మానాన్ని నవంబరులో ఆమోదించింది. అయితే, అప్పటికీ నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ ఏడాది జనవరిలో ఈ కూటమి నుంచి వైదొలగిన సీఎం.. మళ్లీ బీజేపీ గూటికి చేరారు. తాజాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో.. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో మూడో అతి పెద్ద పార్టీగా  జేడీయూ అవతరించింది. ఈ క్రమంలోనే 'ప్రత్యేక హోదా' అంశాన్ని లేవనెత్తడంపై అంతటా ప్రాధాన్యత సంతరించుకుంది. 'బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, సవాళ్లు, సమస్యలను పరిష్కరించడంతో ఇది కీలక దశ' అని జేడీయూ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అటు, ఇదే సమావేశంలో పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా సీనియర్ నేత సంజ్‌ఝాను ఎన్నుకొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి.?

2014లో ప్రత్యేక రాష్ట్రం విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విభజన తీర్మానంలో పొందుపరిచింది. అయితే, ఆ తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు (NDA Government) ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కాగా, దేశంలో ప్రత్యేక హోదా సాధనకు ఏపీ, బిహార్ రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. గతంలో కేంద్రంలో ఎన్డీయే కూటమిలో బీజేపీకి సొంతంగా బలం ఉండడంతో ఈ డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో ఏపీ నుంచి టీడీపీ, బీహార్ నుంచి జేడీయూలు కీలకంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నితీశ్ కేంద్రం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. మరి ఈ డిమాండ్‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ సీఎం చంద్రబాబుపై (CM Chandrababu) ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారులో ఆయన కూడా కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఈసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే డిమాండ్ ఆయనపై మళ్లీ బలంగా వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనపై ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget