చంద్రయాన్ -2 నుంచి అదిరిపోయే అప్‌డేట్- విక్రమ్ ల్యాండర్ ఫొటోలు షేర్ చేసిన ఇస్రో
చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు అప్పట్లోనే హై-రిజల్యూషన్ కెమెరా (OHRC)ను అమర్చారు. ఇది ఇప్పటికీ చంద్రుని చుట్టూ తిరుగుతుంది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శుక్రవారం ట్విట్టర్ అకౌంట్‌లో కొన్ని ఫోటుు షేర్ చేసింది. రెండు రోజుల క్రితం చంద్రుడిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలు అంటూ చెప్పుకొచ్చింది. గతంలో విఫలమైందని అనుకున్న చంద్రయాన్ -2 ఆర్బిటర్ ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఆ ఫొటోలు పంపించింది చంద్రయాన్ -2 ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరానే.
చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు అప్పట్లోనే హై-రిజల్యూషన్ కెమెరా (OHRC)ను అమర్చారు. అందుకే చంద్రయాన్-3లో అలాంటి సెటప్ పెట్టలేదు. దీని కోసం చంద్రయాన్-2 ఆర్బిటర్‌పైనే ఆధారపడి ఉంది. ఆ నాడు పంపిన కెమెరానే ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌లకు అమర్చిన కెమెరాల్లో అత్యుత్తమ రిజల్యూషన్‌ను కలిగి ఉందని ఇస్రో రాసింది.
Chandrayaan-3 Mission update :
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 25, 2023
I spy you! 🙂
Chandrayaan-2 Orbiter
📸photoshoots
Chandrayaan-3 Lander!
Chandrayaan-2's
Orbiter High-Resolution Camera (OHRC),
-- the camera with the best resolution anyone currently has around the moon 🌖--
spots Chandrayaan-3 Lander
after the… pic.twitter.com/tIF0Hd6G0i
ఇస్రో ఈ పోస్టు చేసిన కాసేపటికే తన అధికారిక ట్విట్ ఖాతా నుంచి డిలీట్ చేసింది. అయితే చంద్రయాన్ -3 కోసం క్రియేట్ చేసిన అకౌంట్‌లో మాత్రం పోస్టును అలానే ఉంచింది.