అన్వేషించండి

IRCTC Tourism: రూ.15 వేలకే తొమ్మిది రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనభాగ్యం - దక్షిణ భారతదేశ యాత్ర ప్యాకేజీ వివరాలు

IRCTC Tourism: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణీకులు కోసం ట్రావెలింగ్ ప్యాకేజీలను ప్రకటిస్తూనే ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వాళ్లకు ఐఆర్ సీటీసీ మంచి ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.

Divya Dakshin Yatra with Jyotirlinga:  భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణీకులు కోసం టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూనే ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వాళ్లకు ఐఆర్ సీటీసీ ఓ మంచి ప్యాకేజీను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.  భారతీయ రైల్వే టూరిజం కోస మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌ను ప్రకటించింది.  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి  దివ్య దక్షిణ యాత్రను ఆపరేట్ చేయనుంది.

ఐఆర్ సీటీసీ తీసుకొచ్చిన ప్యాకేజీలో అరుణాచలం (Arunachalam), రామేశ్వరం (Rameswaram), మధురై (Madurai), కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ లలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు.  ఇది ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల టూర్ ప్యాకేజీ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఎక్కొచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.  ఈ టూర్ ప్యాకేజీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ప్రవేశపెట్టబడింది. ఈ టూర్ ప్యాకేజీలో, భక్తులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్రయాణిస్తారు.  ఈ నెల 25న హైదరాబాద్ నుంచి టూర్ మొదలవుతుంది.

 బోర్డింగ్/డీబోర్డింగ్ పాయింట్లు ఎక్కడ ఉంటాయి?
ఈ టూర్ ప్యాకేజ్‌లోని ప్రయాణికులు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల నుండి ఎక్కవచ్చు/దిగిపోవచ్చు.
  
టూర్ ప్లానింగ్ ఇలా 
ఐఆర్ సీటీసీ టూరిజం దివ్య దక్షిణ యాత్ర మొదటి రోజు సికింద్రాబాద్ నుండి ప్రారంభమవుతుంది. మొదటి రోజు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, రెండో రోజు నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఈ టూరిస్ట్ రైలు ఎక్కవచ్చు. రెండో రోజు తిరువణ్ణామలై చేరుకుంటారు. అరుణాచలం ఆలయాన్ని సందర్శించవచ్చు. మూడో రోజు రామేశ్వరం చేరుకుంటారు. స్థానిక దేవాలయాలు చూడవచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేస్తారు. నాల్గవ రోజు రామేశ్వరం నుండి మధురైకి బయలుదేరుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆ తర్వాత కన్యాకుమారి బయలుదేరాలి. ఐదవ రోజు రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ చూడవచ్చు. రాత్రికి కన్యాకుమారిలో బస చేస్తారు.

ఆరవ రోజున త్రివేండ్రం బయలుదేరుతారు. శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్ చూడవచ్చు. ఆ తర్వాత తిరుచిరాపల్లికి బయలుదేరారు. ఏడవ రోజు శ్రీరంగం దేవాలయం, బృహదీశ్వరాలయం చూడవచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎనిమిదో తేదీన రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, తొమ్మిదో తేదీన సికింద్రాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

 ఈ టూర్ ప్యాకేజీ ధర
ఈ టూర్ ప్యాకేజీలోని ఎకానమీ క్లాస్‌లో  ప్రయాణించినట్లయితే..  ఒక వ్యక్తికి రూ.14,250 చెల్లించాలి. స్టాండర్డ్ కేటగిరీలో ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.21,900 చెల్లించాలి. అయితే, మీరు కంఫర్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తే, ఒక్కొక్కరికి రూ. 28,500 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు ఎకానమీ క్లాస్‌లో రూ. 13,250, స్టాండర్డ్ క్లాస్‌లో రూ. 20,700, కంఫర్ట్ క్లాస్‌లో రూ. 27,010 చెల్లించాలి. ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఇతర టూర్ ప్యాకేజీల మాదిరిగానే  పర్యాటకులకు వసతి, ఆహార సౌకర్యాలు కూడా అందించబడతాయి.

ప్యాకేజీ పేరు – జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర (SCZBG10)
కవర్ చేయబడిన గమ్యస్థానాలు - తిరువణ్ణామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి మరియు తంజావూరు.
పర్యటన ఎన్ని రోజులు ఉంటుంది - 8 రాత్రులు మరియు 9 రోజులు
బయలుదేరే తేదీ - మే 25 , 2024
భోజన పథకం - ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం,  రాత్రి భోజనం
ట్రావెల్ మోడ్ - భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
తరగతి - స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ

దర్శించే ప్రదేశాలు
తిరువణ్ణామలై- అరుణాచలం దేవాలయం (Arunachalam Temple)
రామేశ్వరం- రామనాథస్వామి దేవాలయం (Ramanathaswamy Temple)
మధురై- మీనాక్షి అమ్మవారి ఆలయం (Meenakshi Amman Temple)
కన్యాకుమారి- రాక్ మెమోరియల్, కుమారి అమ్మ వారి టెంపుల్ (Kumari Amman Temple)
త్రివేండ్రం- పద్మనాభస్వామి ఆలయం (Shree Padmanabhaswamy Temple)
తిరుచ్చి - రంగనాథస్వామి ఆలయం (Sri Ranganathaswamy Temple)
తంజావూరు - బృహదీశ్వరాలయం (Brihadeeswara Temple)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Social Media Arrests: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు - నాడు వైసీపీ చేసిందే నేడు టీడీపీ చేస్తోందా ?
ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు - నాడు వైసీపీ చేసిందే నేడు టీడీపీ చేస్తోందా ?
Telangana Wineshops: తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP DesamUsha Chilukuri vs Kamala Harris |  Donald Trump విక్టరీతో US Elections లో తెలుగమ్మాయిదే విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Social Media Arrests: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు - నాడు వైసీపీ చేసిందే నేడు టీడీపీ చేస్తోందా ?
ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు - నాడు వైసీపీ చేసిందే నేడు టీడీపీ చేస్తోందా ?
Telangana Wineshops: తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో చిచ్చు రేపిన ప్లకార్డు - కొట్టుకున్న ఎమ్మెల్యేలు
Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు
Citadel Honey Bunny Review - సిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
సిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి
Donald Trump :  ట్రంప్‌  గెలుపుతో భారత్‌కు లాభమా ? నష్టమా ?
ట్రంప్‌ గెలుపుతో భారత్‌కు లాభమా ? నష్టమా ?
Embed widget